
పేకాట ఆడుతూ పట్టుబడిన నిందితులు
ఆనందపురం (భీమిలి): తెలుగుదేశం పార్టీ కార్యాలయమంటే తమకు దేవాలయమన్నది చంద్రబాబు నాయుడి నిన్నటి మాట. కాబట్టే.. ఆ కార్యాలయంలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బూతులు మాట్లాడారన్నది వేరే విషయం. ఇది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం. వీళ్లు దీన్నెలా భావిస్తారో తెలియదు కానీ.. శనివారం ఇలా పేకాట ఆడుకుంటూ 9 మంది స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని ఆనందపురం జంక్షన్‌లో తెలుగుదేశం పార్టీ భీమిలి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయంలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
ఇక్కడ చాలా రోజులుగా జూద శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఆ కార్యాలయంలో పేకాట నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో సీఐ వై.రవి ఆదేశాల మేరకు ఎస్‌ఐలు నరసింహమూర్తి, శ్యామ్‌సుందర్ దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న పిల్లా వినయ్, బంటుబిల్లి రాజు, మీసాల నాగరాజు, కనకుర్తి అఖిల్, సారిక విజయ్‌కుమార్, కోరాడ సురేష్, పిల్లా తరుణ్, కోరాడ ప్రదీప్, కోర్రాయి తేజలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10,610 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment