Yatra celebrations
-
Yatra 2 @ London : లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు
పరిమళించిన క ృష్ణతత్వం కర్నూలు(కల్చరల్) : స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇస్కాన్ నామహట్ట ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలు, న ృత్య సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన న ృత్యాలు ఆకట్టుకున్నాయి. రామకృష్ణ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన అంబాడి కన్నయ్య... భజగోవిందం న ృత్యం, సిద్ధి వినాయక సంగీత న ృత్యనిలయం ప్రదర్శించిన దశావతారం, భాష్యం స్కూల్ విద్యార్థుల క ృష్ణ లీలలు, సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన అదిగో.. అల్లదిగో... ముద్దుగారే యశోద... చక్కని తల్లికి ఛాంగుభళా అనే న ృత్యాలుఅలరించినాయి. నారాయణ స్వామి బృందం ప్రదర్శించిన భామా కలాపం, సాగర మధనం నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కృష్ణతత్వ ప్రచారంలో సహకరించిన వారందరికీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన రామగోవింద మహరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఇస్కాన్ చేపట్టిన ఈ మహత్తర యజ్ఞంలో స్థానికులు తమ చక్కని సహకారాన్ని అందించారన్నారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థులు వలంటీర్లుగా పాల్గొని సేవలందించారన్నారు. భారతమాత మాత ృమండలి సభ్యులు, వివేకానంద స్టడీ సర్కిల్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారన్నారు. ఇస్కాన్ సంస్థ సభ్యులు, నిర్వాహకులు రూపేష్ ప్రభు, క ృష్ణ చైతన్య ప్రభు, వైష్ణవ ప్రభు, బృందావనం గోకులపతి మాధవదాస్, సంకీర్తన బృందం జగద్గురు గౌరంగాదాస్, ద్వారకానాథ్ దాస్, నృత్యజ్యోతి సంస్థ నిర్వాహకులు భార్గవకుమార్ పాల్గొన్నారు.