ముగిసిన జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు
పరిమళించిన క ృష్ణతత్వం
కర్నూలు(కల్చరల్) : స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇస్కాన్ నామహట్ట ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలు, న ృత్య సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన న ృత్యాలు ఆకట్టుకున్నాయి. రామకృష్ణ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన అంబాడి కన్నయ్య... భజగోవిందం న ృత్యం, సిద్ధి వినాయక సంగీత న ృత్యనిలయం ప్రదర్శించిన దశావతారం, భాష్యం స్కూల్ విద్యార్థుల క ృష్ణ లీలలు, సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన అదిగో.. అల్లదిగో... ముద్దుగారే యశోద... చక్కని తల్లికి ఛాంగుభళా అనే న ృత్యాలుఅలరించినాయి.
నారాయణ స్వామి బృందం ప్రదర్శించిన భామా కలాపం, సాగర మధనం నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కృష్ణతత్వ ప్రచారంలో సహకరించిన వారందరికీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన రామగోవింద మహరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఇస్కాన్ చేపట్టిన ఈ మహత్తర యజ్ఞంలో స్థానికులు తమ చక్కని సహకారాన్ని అందించారన్నారు.
జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థులు వలంటీర్లుగా పాల్గొని సేవలందించారన్నారు. భారతమాత మాత ృమండలి సభ్యులు, వివేకానంద స్టడీ సర్కిల్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారన్నారు. ఇస్కాన్ సంస్థ సభ్యులు, నిర్వాహకులు రూపేష్ ప్రభు, క ృష్ణ చైతన్య ప్రభు, వైష్ణవ ప్రభు, బృందావనం గోకులపతి మాధవదాస్, సంకీర్తన బృందం జగద్గురు గౌరంగాదాస్, ద్వారకానాథ్ దాస్, నృత్యజ్యోతి సంస్థ నిర్వాహకులు భార్గవకుమార్ పాల్గొన్నారు.