గుంటూరు, సాక్షి: ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ.. పేదల తరఫున పెత్తందారులతో సమరానికి సిద్ధం అయ్యారు వైస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఈ క్రమంలో.. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ సారథికి జనం నీరాజనం పడుతున్నారు.
సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. జగన్ వన్స్‌మోర్.. జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా సిద్ధం నినాదాన్ని వినిపిస్తున్నారు కూడా. తాజాగా నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! అంటూ ట్వీట్ చేశారాయన.
నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! #VoteForFan#YSRCPStarCampaigners pic.twitter.com/AIxA9Nccsm
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024
గత 59 నెలల పాలనలో అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో పాటు పడ్డారు. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బటన్ నొక్కి వాళ్ల ఖాతాల్లోనే జమ చేశారు. అంతేకాదు.. ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే రిజిస్టర్ చేయించారు. అంతటితోనే ఆగకుండా.. సొంత కాళ్ల మీద నిలబడేందుకు పథకాల ద్వారా ఆసరాగా నిలుస్తూ వచ్చారు. అందుకే ఏపీ మహిళా లోకం జగన్ కోసం సిద్ధం అంటోంది.
మరోవైపు చంద్రబాబుకు ఉన్నట్లు తనకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని.. తాను చేసిన మంచిని అందుకున్న సామాన్యులే తన స్టార్‌క్యాంపెయినర్లు అని సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. అందుకు తగ్గట్లే.. 12 మంది సామాన్యులను ఎంపిక చేసింది వైస్సార్‌సీపీ. అందులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment