వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాసేపటి కిందటే ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అందుకు ముందు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నామినేషన్ గ్యాప్‌లో తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
సిద్ధం పేరుతో ఒకవైపు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తాజాగా ట్వీట్ చేశారాయన.
Andhra Pradesh Siddham!#VoteForFan
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2024
అంతకు ముందు వైఎస్సార్‌సీపీ సిద్ధం సభల్లో తన ప్రసంగాలతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల సమయంలోనూ ఆయా జిల్లాలను ఉద్దేశిస్తూ సిద్ధం అని ట్వీట్లు చేసింది చూశాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుస్తూ.. పార్టీలో జోష్ నింపుతూ ఆంధ్రప్రదేశ్ సిద్ధం అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment