ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్‌ | Kurnool Siddham: CM Jagan Strong Support reservation for minorities | Sakshi
Sakshi News home page

మైనారిటీలపై నాది నిజమైన ప్రేమ.. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్‌

Published Thu, May 9 2024 12:11 PM | Last Updated on Thu, May 9 2024 1:18 PM

Kurnool Siddham: CM Jagan Strong Support reservation for minorities

కర్నూలు, సాక్షి:  చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌ ప్రధానంగా స్పందించారు. 

‘‘చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు.  ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా?.  ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్‌ మాట. ఇది వైఎస్సార్‌ బిడ్డ మాట’’ అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. 

‘‘ మైనారిటీలకు రిజర్వేషన్లపై  మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్‌ నిలదీశారు. 

మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్‌, సయ్యద్‌, మొగల్స్‌ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.

అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు?. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ, సీఏఏ విషయంలో.. ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్‌ ఇమాందార్‌కు మేం మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. 

ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం,  ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా.  

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement