విజయం అంటే భయం! | More than failure, I am scared of success | Sakshi
Sakshi News home page

విజయం అంటే భయం!

Published Sat, Jun 22 2019 1:57 AM | Last Updated on Sat, Jun 22 2019 1:57 AM

More than failure, I am scared of success - Sakshi

ధనుష్‌

జీవితంలో ఎవరైనా అపజయానికి భయపడతారు. సినిమా తమ సినిమాలు విడుదలైన ప్రతిసారీ రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని టెన్షన్‌ పడతారు. ఒక్క ఫెయిల్యూర్‌ వాళ్ల కెరీర్‌ని నిర్దేశిస్తుంది. అందుకే అపజయం అంటే భయం. కానీ ధనుష్‌ మాత్రం ఫెయిల్యూర్‌ కంటే సక్సెస్‌ తనను మరింత భయపెడుతుందని చెబుతున్నారు. ఒక యాక్టర్‌గా సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ను మీరెలా డీల్‌ చేస్తారు? అన్న ప్రశ్నను ధనుష్‌ ముందు ఉంచితే...‘‘జయాపజయాలను నేను ఒకేలా తీసుకుంటాను.

నా సినిమా ఆడనప్పుడు ప్రేక్షకులకు ఎందుకు కనెక్ట్‌ కాలేదా? అని ఆలోచిస్తా. ఫెయిల్యూర్‌ని ఎవరూ కోరుకోం కానీ నిజానికి నా సినిమా హిట్‌ సాధిస్తేనే నాకు ఎక్కువగా భయం ఉంటుంది. ఎందుకంటే సక్సెస్‌ను డీల్‌ చేయడం కష్టం. ఆ సక్సెస్‌ మనల్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెట్రిమారన్, ఆర్‌ఎస్‌.థురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు ధనుష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement