ఫెయిలవుతానని సీఏ విద్యార్థి ఆత్మహత్మ | CA and be a student fail the tests atmahatma | Sakshi

ఫెయిలవుతానని సీఏ విద్యార్థి ఆత్మహత్మ

Published Tue, Feb 2 2016 4:36 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

దుండిగల్: సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన శోభారాణి కుమారుడు అల్లం బాల అఖిల్‌రెడ్డి (21) గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో సీఏ చదువుతున్నాడు.సీఏ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయి న అఖిల్ ఇటీవల మరోసారి పరీక్ష రాశాడు.  వాటి ఫలితాలు సోమవా రం   వెలువడనున్నడంతో మళ్లీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయం తో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అఖిల్‌రెడ్డి చిన్నతనంలోనే తండ్రి భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు. తల్లి శోభారాణి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కుమారుడిని చది విస్తోంది. ఘటనా స్థలంలో అఖిల్ రాసి సూసైడ్ నోట్ దొరికింది. అం దులో ‘‘చదువు కోల్పోయా...తండ్రిని కోల్పోయా... ప్రేమను కోల్పోయా...జీవితాన్ని కోల్పోయా... సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో చనిపోతున్నా’’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement