ప్రతీకాత్మక చిత్రం
ఏర్పేడు(చిత్తూరు జిల్లా): కొంగల కోసం ఇంట్లో దాచిన గుళికలను తినుబండారమనుకుని తినడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఏర్పేడు మండలం, ముసలిపేడు పంచాయతీ, బత్తెనయ్య ఎస్టీ కాలనీలో సోమవారం విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం.. ముసలిపేడు బత్తెనయ్య ఎస్టీ కాలనీకి చెందిన బాబు, గోవిందమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
చదవండి: ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి..
బాబు తరచూ కొంగలకు గుళికలు పెట్టి, మృతి చెందిన తర్వాత వాటిని తెచ్చుకుని తింటుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో గుళికల ప్యాకెట్ ఉంచి సోమవారం బాబు తన భార్య గోవిందమ్మతో కలిసి వ్యవసాయ కూలి పనులకు వెళ్లాడు. బాబు రెండో కుమారుడు నాని(3) ఇంట్లోని గుళికలను తినుబండారం అనుకుని వాటిని తినడంతో అపస్మారక స్థితికి చేరుకుని కొంత సేపటికే మృతిచెందాడు. విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment