సాధారణంగా చికెన్‌ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి.
ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్‌ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్‌ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్‌ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ
అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు.
కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్‌తో చికెన్‌ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్‌ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
(చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్‌లో కూతురు)
Comments
Please login to add a commentAdd a comment