ఎమోషనల్ ఈటింగ్‌కు దూరంగా ఉండండి!
మెన్స్ హెల్త్
బొజ్జ రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బొజ్జ మీ వైపు కన్నెత్తి కూడా చూడదు...
ప్లేట్ పరిమాణం మీద దృష్టి పెట్టండి. ఒక అధ్యయనం ప్రకారం ప్లేట్ పరిమాణాన్ని బట్టి కూడా మనం తినే తిండి ఆధారపడి ఉంటుంది. పెద్ద ప్లేటులో తిన్నప్పుడు కాస్త గట్టిగానే లాగిస్తాం. అలాకాక తక్కువ, ఎక్కువ కాని ప్లేట్‌ను ఎంచుకోవడం మంచిది.
బాగా పొద్దుపోయాక భోజనం చేయవద్దు. మరీ ఆకలిగా ఉంటే పండ్లుగానీ, స్నాక్స్ గానీ తినడం మంచిది.
భోజనం చేసిన సమయానికి, బెడ్ మీద చేరే సమయానికి కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
‘ఎమోషనల్ ఈటింగ్’కు దూరంగా ఉండండి. కొందరు విచారంలో ఉన్నప్పుడుగానీ, సంతోషంగా ఉన్నప్పుడుగానీ, కోపంగా ఉన్నప్పుడుగానీ సాధారణం కంటే చాలా ఎక్కువగా తింటారు. దీన్నే ‘ఎమోషనల్ ఈటింగ్’ అంటారు. దీనికి దూరంగా ఉండడం మంచిది. భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే గ్లాస్ నీళ్లు తాగండి. కొద్దిసేపు నడవండి.
ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి, లో-ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి? అనే దాని మీద అవగాహన ఉండాలి.
నిద్రలేమి, తక్కువ నిద్రపోవడం లాంటి సమస్య వల్ల కూడా పొట్ట పెరుగుతుంది.