గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే..
గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది.
పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు.
వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే..
- గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్‌ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది.
- ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్‌ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్
- గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్‌పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది.
- అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!)
Comments
Please login to add a commentAdd a comment