ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది.
చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ లైవ్ టెలికాస్ట్‌లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయారు. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ ఈటింగ్ ఛాలెంజ్‌లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు తినడం వల్ల మరణించినట్లు సమాచారం.
స్థానిక చైనా మీడియా వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతి ఈటింగ్ ఛాలెంజ్‌లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. ఇలా అతిగా తినడం మంచిది కాదని.. ఆమె కుటుంబసభ్యులు వారించినా పట్టించుకోలేదు.ఇలా చివరికి అదే ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొని ప్రాణాలో పోవడంతో విషాదం నెలకొంది.
జియోటింగ్ మరణం అనంతరం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో జీర్ణించుకోలేని విధంగా ఆహారం తినడం వల్లే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment