బయట తినేటప్పుడు జర భద్రం..! | Beware Of Eating Outside Food And Avoid Eating Out | Sakshi
Sakshi News home page

బయట తినేటప్పుడు జర భద్రం..! సాధ్యమైనంత వరకు..

Published Fri, Jun 28 2024 6:12 PM | Last Updated on Fri, Jun 28 2024 6:36 PM

Beware Of  Eating Outside Food And Avoid Eating Out

వీధి వీధికి  ఒక రెస్టారెంట్‌, చిన్న చిన్న ఫుడ్‌ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లెన్‌ ఫుడ్‌ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్‌పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే..అందులో ఏకంగా చికెన్‌ పీస్‌లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..

మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్‌గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్‌ వంటకాలు ఆర్డర్‌ చేశారు. అయితే సర్వర్‌ తెచ్చిన పనీర్‌ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. 

వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్‌ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్‌ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్ర‍శ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్‌ ప్యాక్‌ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్‌ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. 

ఇది అందరూ చేసే తప్పు..
కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్‌లలో అన్నం, కూరగాయలు, సలాడ్‌లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్‌లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే జరగడం బాధకరం. 

ఒ‍క్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్‌లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! 

మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్‌ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. 

ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్‌ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్‌గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్‌ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్‌లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్‌లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. 

ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. 

ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్‌ సర్వర్‌ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. 

వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్‌కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్‌ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే.  కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 

(చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement