
డైనింగ్ ఎటికేట్‌లో భాగంగా కొన్ని రెస్టారెంట్‌లలో, ఫంక్షన్‌లలో ఫోర్క్, నైఫ్‌లతో తినడం తప్పనిసరి అవుతుంది. అయితే అది అందరికీ సులభం కాకపోవచ్చు. పొరపాట్లు దొర్లవచ్చు. ఎవరైనా గమనిస్తున్నారేమో... అనే ఆలోచనతో కూడా భోజనాన్ని సరిగ్గా తినలేకపోవచ్చు.
‘ఇదంతా ఎందుకు... ఫోర్క్, నైఫ్‌లతో సరిౖయెన పద్ధతిలో ఎలా తినాలో నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్యుటోరియల్ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోలో ఫోర్క్, నైఫ్‌లతో ఎలా తినాలో చూపించింది నీనా గుప్తా. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లితే... ఒకప్పుడు నీనా కూడా ఫోర్క్, నైఫ్‌లతో తినడం రాక చాలా ఇబ్బంది పడేది. దీంతో పట్టుదలగా తినే పద్ధతిని నేర్చుకుంది. ‘నాకైతే చేతులతో తినడమే ఇష్టం’ అని నీనా గుప్తా చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment