
తన మనసులోని భావాలను అభిప్రాయాలకు నిక్కచ్చిగా చెప్పే మహిళల్లో ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఒకరు. ‘సచ్ కహో తో’ అంటూ తన ఆటోబయోగ్రఫిలో నీనా గుప్తా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే రేపారు. తల్లిని తన తండ్రి మోసగించిన తీరు.తల్లి ఆత్మహత్యాయత్నం చేయడం లాంటి ఇందులో ప్రస్తావించారు. అలాగే క్రికెటర్ రిచర్డ్స్‌తో సహజీవనం, మసాబాకు జన్మనివ్వడం, సింగిల్ పేరెంట్‌గా ఆర్థిక ఇబ్బందులు, బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల వేధింపులు బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల వేధింపులు ఇలా చాలా విషయాలను కూడా ఆత్మకథలో నిర్మొహమాటంగా రాసుకొచ్చారు.
ఆడబ్రతుకు శాపం కన్నా తక్కువేమీకాదు
ఇటీవల ఫాల్తూ ఫెమినిజం అంటూ స్త్రీ పురుషు సమానత్వంపై మనసులోని మాట బెట్టింది నీనాగుప్త. స్త్రీ పురుషులు ఎప్పటికీ సమానంగా ఉండలేరంటూ స్త్రీవాద ఉద్యమం వేస్ట్ కొట్టి పారేసిన నీనా గుప్త తాజాగా మరోసారి దేశంలోని మహిళల భద్రత, దేశంలోని మహిళల పరిస్థితిపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. మహిళగా పుట్టడం శాపమే నని, ముఖ్యంగా పేద మహిళగా పుట్టడం శాపం కంటే తక్కువేమీ కాదని పేర్కొనడం గమనార్హం. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నీనా గుప్త గత వివాదాలు, స్త్రీవాద చర్చ, స్త్రీగా పుట్టడంపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే భారతదేశంలోని మహిళల కోసం తాను ఏమి కోరుకుంటున్నాడో అడిగినప్పుడు,
“నేను కోరుకునేది సాధ్యం కాదు. మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అదీ సాధ్యం కాదు. మహిళలకు విద్య నేర్పించాలి.. చదువుకోవాలి అంటారు...ఆ తరువాత వాళ్లు ఉద్యోగం చేయాలను కుంటారు. తీరా ఉద్యోగానికి వెళితే అత్యాచారానికి గురవుతారు. మరిది శాపం గాకపోతే మరేమిటి? ‘స్త్రీగా, పేద మహిళగా పుట్టడం శాపం’ గానే భావిస్తున్నాను. ఈ పరిస్థితి చాలా బాధగా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆశావహంగా ఎలా మాట్లాడగలను అంటూ ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలోని ఒక వర్గం మహిళలు శారీరక సాన్నిహిత్యాన్ని వివాహం తర్వాత కేవలం ఒక విధిగా మాత్రమే చూడాలి. ఆనందం కోసంగా కాదు అనేలా ఉన్న సామాజిక కట్టుబాటుపై కూడా ఆమె స్పందించారు.
‘ఫాల్తూ’ స్త్రీవాద వివాదంపై స్పందన
నీనా గుప్తా లింగ సమానత, సమస్యలపై నీనా గుప్తా వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడం ఇదే మొదటిసారి కాదు. ‘సమానత్వం అనే ఆలోచనను నమ్మాల్సిన అవసరం లేదు దీనికి బదులుగా, ఆర్థిక సాధికారత, పనిలో నైపుణ్యంపై మీ పనిపై శ్రద్ధ చూపాలి. గృహిణి అయితే, ఏం తక్కువ. నిజానికి ఇది ఒక ముఖ్యమైన పాత్ర. మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి. ఆత్మగౌరవాన్ని పెంచుకోండి ఇదే మహిళలకు చెప్పాలనుకుంటున్న ప్రధాన సందేశం’’ అన్నారామె.
చదవండి: చెక్క ముక్కను నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
పురుషులు, మహిళలు సమానం కాదు. పురుషులు గర్భం దాల్చడం ప్రారంభించిన రోజే సమానత అని చెప్పింది నీనా గుప్తా. అయితే కాంటెక్ట్స్ సంబంధం లేకుండా మొత్తం ఇంటర్వ్యూలోని ఒక భాగాన్ని ప్రమోషన్ల కోసం మాత్రమే ఉపయోగించారని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. కాగా పంచాయత్ సిరీస్‌తో నటిగా విశ్వరూపం చూపించారు నీనా. బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పంచాయత్ సీజన్ 4 విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య