కొందరికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే ఆరోగ్యపరంగా ఏవో సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయండం ద్వారా ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు.
► ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే... దీనికి మరో కాఱనం.. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఆకలి పెరగుతుంది.
► మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం.
► బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఒకేసారి భోజనం చేయడం మరికొందరికి అలవాటు. దీనివల్ల ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ ఏర్పడి ఎక్కువ తినేస్తారు.
► కొందరికి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి మెడిసిన్స్ కారణం ఉండొచ్చు. మెడిసిన్స్‌లో రాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి.
► అతిగా వర్కవుట్స్ చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోయి ఎక్కువగా ఆకలేస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
►ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది ఒత్తిడి. ఈరోజుల్లో చాలావరకు ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
►మనం తినే ఆహారంలో శరీరానికి సరైన పోషకాలు, ప్రోటీన్స్ అందకపోయినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి సరైన డైట్‌ను పాటిస్తూ వేళకు భోజనం, 8గంటల నిద్ర పాటిస్తే మంచిందటున్నారు డైటీషియన్స్
Comments
Please login to add a commentAdd a comment