
'అయితే త్వరలోనే మీరు లావెక్కడం ఖాయం'
లండన్: మీ డైనింగ్ టేబుల్‌పై పెద్దపెద్ద భోజన పాత్రలు ఉన్నాయా? పెద్ద కప్పులు గ్లాసుల్లో కాఫీలు, కూల్‌డ్రింకులు తాగుతున్నారా? అయితే త్వరలోనే మీరు లావెక్కడం ఖాయమంటున్నారు కేంబ్రిడ్జి పరిశోధకులు. పెద్ద పాత్రల వినియోగం వల్ల అధిక బరువు ముప్పు పొంచి ఉందని ఇటీవల వారు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ తరహా పాత్రల్లో భోజనం చేయడం, చక్కెరతో కూడిన పానీయాలు తాగడం ద్వారా కావాల్సిన దానికంటే రెట్టింపు పరిమాణంలో క్యాలరీలు శరీరంలోకి చేరుతున్నాయని గుర్తించారు.
ఇలాంటి పాత్రలను వెంటనే మార్చడం ద్వారా బ్రిటన్‌లో 16 శాతం, అమెరికాలో 29 శాతం ఊబకాయం ముప్పును తగ్గించవచ్చంటున్నారు. ఇందుకోసం పరిశోధకులు 6,711 మందిపై పరిశోధనలు జరిపారు. వీరంతా కేవలం పాత్రల పరిమాణం కారణంగా సరిపడినదానికంటే అధిక ఆహారాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటు ఇతర వ్యాధులు వస్తున్న సంగతి తెలిసిందే!