నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.
పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.
సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్‌ను కలిగిస్తుంది.
ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.
పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.
ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం..
Comments
Please login to add a commentAdd a comment