ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ! | flaming paan is too cool | Sakshi
Sakshi News home page

ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!

Published Sat, Jan 16 2016 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ఈ  'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!

ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!

 భోజన ప్రియులకు.. తాంబూల  సేవనం గురించి  చెప్పనక్కరలేదు. అందులోనూ రకరకాల కిళ్లీలను ఆరగించడానికి ప్రయత్నించే పాన్  ప్రియులకు  అస్సలు వివరించనక్కలేదు.  కానీ ఈ మంటల తాంబూలం అదే... ఫైర్ పాన్ గురించి మాత్రం కచ్చితంగా చెప్పాల్సిందే.. అవును వినడానికి వింతగా ఉన్నా.. భగ్గున మండుతున్న ఈ కిళ్లీ చాలా కూల్ గురూ అంటున్నారు తయారీదారులు. అటు మండుతున్న  కిళ్లీని లొట్టలేసుకుంటూ.. సారీ,  పొగల సెగలు  కక్కుతూ నములుతున్నారు వినియోగదారులు.
 
గత 30 ఏళ్లుగా ఈ పాన్ బిజినెస్ చేస్తున్న రాజ్ కోట్ కు చెందిన చున్నీ లాల్  ఈ ఫ్లేమింగ్ కిళ్లీని వినియోగదారులకు పరిచయం చేశారు.  మండుతున్న  ఈ పాన్  రెసిపీని కనుక్కోవడానికి తమకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందంటున్నాడు.  తమలపాకుల్లో  లవంగాలు, వక్కలు, ఇతర పదార్థాలు మధ్య యాలకలు లాంటి స్థానిక మూలికలతో దీన్ని తయారు చేస్తున్నామన్నారు.  మండుతూ ప్రమాదకరమైందిగా  కనిపించే ఈ పాన్  చల్లని అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేకాదు ఇంతవరకు ఈ  పాన్ తిని ఎవరూ అనారోగ్యం కానీ, గాయపడింది లేదని ధీమాగా చెపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement