flaming
-
థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్!
సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్) గుర్తును ఖరారు చేసింది. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్చీ శివసేన' పేరును ఫైనల్ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది. అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!
భోజన ప్రియులకు.. తాంబూల సేవనం గురించి చెప్పనక్కరలేదు. అందులోనూ రకరకాల కిళ్లీలను ఆరగించడానికి ప్రయత్నించే పాన్ ప్రియులకు అస్సలు వివరించనక్కలేదు. కానీ ఈ మంటల తాంబూలం అదే... ఫైర్ పాన్ గురించి మాత్రం కచ్చితంగా చెప్పాల్సిందే.. అవును వినడానికి వింతగా ఉన్నా.. భగ్గున మండుతున్న ఈ కిళ్లీ చాలా కూల్ గురూ అంటున్నారు తయారీదారులు. అటు మండుతున్న కిళ్లీని లొట్టలేసుకుంటూ.. సారీ, పొగల సెగలు కక్కుతూ నములుతున్నారు వినియోగదారులు. గత 30 ఏళ్లుగా ఈ పాన్ బిజినెస్ చేస్తున్న రాజ్ కోట్ కు చెందిన చున్నీ లాల్ ఈ ఫ్లేమింగ్ కిళ్లీని వినియోగదారులకు పరిచయం చేశారు. మండుతున్న ఈ పాన్ రెసిపీని కనుక్కోవడానికి తమకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందంటున్నాడు. తమలపాకుల్లో లవంగాలు, వక్కలు, ఇతర పదార్థాలు మధ్య యాలకలు లాంటి స్థానిక మూలికలతో దీన్ని తయారు చేస్తున్నామన్నారు. మండుతూ ప్రమాదకరమైందిగా కనిపించే ఈ పాన్ చల్లని అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేకాదు ఇంతవరకు ఈ పాన్ తిని ఎవరూ అనారోగ్యం కానీ, గాయపడింది లేదని ధీమాగా చెపుతున్నారు.