paan
-
ఓకైకే పాన్ దోశ వాలా!
‘ఎన్ని రకాల పాన్లు ఉన్నాయి?’ అని అడిగితే హైదరాబాద్ నుంచి అలహాబాద్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు. అలాగే దోశలలో కూడా మైసూర్ దోశ నుంచి రవ్వ దోశ వరకు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. దోశ ప్లస్ పాన్ కాంబినేషన్ అనేది ఊహకు అందదు. అయితే ముంబైవాలా ఒకరు దోశకు పాన్ జత చేస్తూ తయారుచేసిన ‘పాన్ దోశ’ను చూసి నెటిజనులు ‘ఔరారా’ అంటున్నారు.వేడి వేడి దోశలో పాన్‌తో పాటు అంజీర్, డ్రై ఫ్రూట్స్... మొదలైనవి చేర్చాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో 1.5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
కాశీ నుంచి వెండి తమలపాకులు
లక్నో: హిందూ మతంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇళ్లు, ఆలయాలు ఇలా ఎక్కడ ఏ పూజ చేసినా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజకు కాశీ నుంచి వెండి తమలపాకులు తరలి వెళ్లాయి. నాడు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ఈ వెండి తమలపాకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా.. వారు వీటిని తీసుకుని నేడు అయోధ్యకు బయలుదేరారు. (‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’) అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా రాతితోనే జరగునున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించడం లేదని.. మందిర నిర్మాణ పర్యవేక్షకుడు అను భాయ్ సోంపురా తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాను అన్నారు. మందిర నిర్మాణానికి ఇక్కడ లభించే రాళ్లతో పాటు.. రాజస్తాన్ నుంచి కూడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేవలం 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. -
‘గుజరాతీలు జాగ్రత్త.. ఫైన్ కట్టాల్సి వస్తుంది’
లండన్ : హెడ్డింగ్ చూసి ఓ తెగ కంగారు పడిపోకండి. ఇది మన దేశంలో ఉన్న గుజరాతీల కోసం కాదు. యూకేలో నివసిస్తున్న గుజరాతీల కోసం. ఒక్క గుజరాతీలనే కాదు.. యూకేలోని లిసెస్టర్‌లో ఉంటూ పాన్ ఇష్టపడే ప్రతీ భారతీయునికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఇంతకూ ఈ హెచ్చరిక ఎందుకంటే.. పాన్‌పై మనకున్న మక్కువ వారికి తెగ ఇబ్బంది కలిగిస్తుందట. ముఖ్యంగా లిసెస్టర్ ప్రజలు మన వారి పాన్ అలవాటు వల్ల తెగ ఇబ్బంది పడుతున్నారట. దాంతో ‘పాన్ తిని రోడ్ల మీద ఉమ్మి వేయడం మంచి పద్దతి కాదు. అలా చేసిన వారికి రూ. 13 వేల రూపాయల జరిమానా విదిస్తామ’ని హెచ్చరిస్తూ సైన్ బోర్డ్ ఏర్పాటు చేశారు అక్కడి పోలీసులు. Just for information. pic.twitter.com/bd481XA2em — Never fear to speak the truth سچ بولنے سے کبھی ن (@EmpoweringGoa) April 12, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా లిసెస్టర్‌లో ఉండే గుజరాతీలు పాన్ తినడం.. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం చేస్తున్నారట. అందుకే ఈ సైన్ బోర్డ్‌ను కూడా ఇంగ్లీష్, గుజరాతీ రెండు భాషల్లో ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ప్రభుత్వం ఇలా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజుల వరకూ సమస్య సర్దుకున్నట్లే కనిపించింది. తర్వాత మళ్లీ షరా మామూలే. దాంతో ఈ సారి పాన్ నమిలి రోడ్ల మీద ఉమ్మేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది ప్రభుత్వం. అందుకే భారీ మొత్తంలో జరిమానా విధిస్తానంటూ ఇలా సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. -
కొత్త జంటకు స్పెషల్ పాన్.. ఖరీదెంతంటే..?
సాక్షి,ఔరంగాబాద్:మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన పాన్ షాప్‌లో 51 రకాల పాన్లున్నా ఒక పాన్ ధరమాత్రం రూ 5000 పలుకుతున్నా కస్టమర్లు దానికోసం బారులుతీరుతున్నారు. కోహినూర్ పాన్‌గా పేరొందిన ఈ కిళ్లీ ఆ షాప్‌కే హైలైట్ మరి. ఈ పాన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తారా పాన్ సెంటర్‌కు క్యూకడతారు. ఇండియా వయాగ్రాగా పేరొందిన కోహినూర్ పాన్ నవ దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ పాన్‌ను కిలో రూ 70 లక్షలు ధర పలికే స్పెషల్ కస్తూరి, కుంకుమపువ్వు (కిలోరూ 70,000), రోజ్(కిలో రూ 80,000) వంటి పదార్ధాలతో తయారుచేస్తారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్లో మాత్రమే లభ్యమయ్యే సువాసనలు వెదజల్లే ప్రత్యేక లిక్విడ్‌ను వాడతారు. ఇవేకాకుండా షాపు సిబ్బందికి కూడా తెలియని సీక్రెట్ పదార్ధాన్నీ ఈ పాన్ తయారీలో ఉపయోగిస్తారు. షాపు యజమాని మహ్మద్ సిద్ధిఖి, ఆయన తల్లికి మాత్రమే ఈ పదార్ధం తెలుసని చెబుతారు. సిద్ధిఖికి ఆయన తల్లి ఈ పాన్‌ను దానిలో కలిపే రహస్య పదార్ధం గురించి తెలిపిందని అంటారు. తాను పెళ్లయిన తర్వాతే ఈ పాన్‌ను అమ్మడం మొదలెట్టానని సిద్ధిఖి చెబుతారు. తాను వివాహం చేసుకున్నాక తన తల్లి ఈ పాన్‌ను తిని బాగుంటే దాన్ని విక్రయించాలని తనకు సూచించిందని చెప్పారు. అప్పటినుంచి ఈ పాన్‌ను తన షాపు మెనూలో చేర్చానన్నారు. క్రమేణా మౌత్‌టాక్‌తో పాన్ గురించి అందరికీ తెలిసింది. కొత్తగా పెళ్లయిన జంటలు కోహినూర్ పాన్‌ను కొనేందుకు షాపు ముందు క్యూ కడుతున్నారు. పాన్ ధర ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరకు రూ 3000కే ఈ తరహా మరో పాన్‌ను సిద్ధిఖి అందుబాటులోకి తెచ్చారు. తారా పాన్ సెంటర్లో ఇప్పుడు లేడీస్ స్పెషల్ కోహినూర్ పాన్‌ను సిద్ధం చేశారు. కోహినూర్ పాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన బాక్స్‌లో కస్టమర్‌కు అందించడమే కాకుండా దాంతో పాటు పెర్ఫ్యూమ్ను అందిస్తున్నారు. రోజూ 10,000 పాన్లు విక్రయించే ఈ షాపులో కోహినూర్ పాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ
లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డియోరియా టూ ఢిల్లీ కిసాన్ యాత్రలో భాగంగా గురువారం లక్నో ప్రాంతంలో పర్యటించిన ఆయన అభిమానులు అందించిన పాన్‌ను ఆస్వాదించారు. ఉన్నావ్‌లో నిర్వహించిన రాహుల్ రోడ్ షోలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రాహుల్ భయ్యా జిందాబాద్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అటువైపుగా చూసిన రాహుల్‌కు.. ఆ యువకులు స్పెషల్ 'మీఠా పాన్'ను ఆఫర్ చేశారు. అభిమానులు ఇచ్చిన పాన్‌ను రాహుల్ సంతోషంగా స్వీకరించారు. రోడ్ షోలో పాల్గొంటున్న రాహుల్ ప్రజలతో బాగా మమేకం అవుతున్నారని స్థానిక నాయకులు కితాబిస్తున్నారు. యాత్ర సందర్భంగా రాహుల్ సెల్ఫీలకు సైతం అవకాశం కల్పిస్తూ కార్యకర్తలు, పార్టీ అభిమానులను సంతోషపరుస్తున్నారు. -
ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!
భోజన ప్రియులకు.. తాంబూల సేవనం గురించి చెప్పనక్కరలేదు. అందులోనూ రకరకాల కిళ్లీలను ఆరగించడానికి ప్రయత్నించే పాన్ ప్రియులకు అస్సలు వివరించనక్కలేదు. కానీ ఈ మంటల తాంబూలం అదే... ఫైర్ పాన్ గురించి మాత్రం కచ్చితంగా చెప్పాల్సిందే.. అవును వినడానికి వింతగా ఉన్నా.. భగ్గున మండుతున్న ఈ కిళ్లీ చాలా కూల్ గురూ అంటున్నారు తయారీదారులు. అటు మండుతున్న కిళ్లీని లొట్టలేసుకుంటూ.. సారీ, పొగల సెగలు కక్కుతూ నములుతున్నారు వినియోగదారులు. గత 30 ఏళ్లుగా ఈ పాన్ బిజినెస్ చేస్తున్న రాజ్ కోట్ కు చెందిన చున్నీ లాల్ ఈ ఫ్లేమింగ్ కిళ్లీని వినియోగదారులకు పరిచయం చేశారు. మండుతున్న ఈ పాన్ రెసిపీని కనుక్కోవడానికి తమకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందంటున్నాడు. తమలపాకుల్లో లవంగాలు, వక్కలు, ఇతర పదార్థాలు మధ్య యాలకలు లాంటి స్థానిక మూలికలతో దీన్ని తయారు చేస్తున్నామన్నారు. మండుతూ ప్రమాదకరమైందిగా కనిపించే ఈ పాన్ చల్లని అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేకాదు ఇంతవరకు ఈ పాన్ తిని ఎవరూ అనారోగ్యం కానీ, గాయపడింది లేదని ధీమాగా చెపుతున్నారు.