
వారానికి రెండుసార్లు చేపలు తింటే షుగర్ దూరం
లండన్: మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడమేనని సూచిస్తున్నారు వైద్యులు. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా–3తో సమానమని చెబుతున్నారు.
మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్–2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా–3 ఆమ్లాలను ఆహారంలోభాగంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్ దుష్ఫలితాలు 48 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.