సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట! | After Raees, Shah Rukh Khan to undergo one more surgery to fix his knee | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట!

Published Sat, Dec 10 2016 9:27 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట! - Sakshi

సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట!

ముంబై:  బాలీవుడ్  బాద్షా  షారూక్ ఖాన్ న్ని సీరియస్ మెకాలి బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఇటీవల రాయిస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోకాలికి నీ బ్యాండ్‌తో దర్శనమిచ్చిన షారుఖ్‌కి మరోసారి సర్జరీ తో పాటు విశ్రాంతి కూడా తప్పనిసరి అని  సమాచారం. కొన్ని నెలలుగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఈ సూపర్ స్టార్ కి  ఈ మే నెలలో  ఒక ఆపరేషన్ పూర్తయింది.  ఇపుడు  పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో  మరోసారి మరో సర్జరీ జరగనుందని  షారూక్ కి చికిత్స అందిస్తున్న సీనియర్  వైద్యులు చెబుతున్నారు.
ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. సంజయ్ దేశాయ్ ఈ విషయాలను వెల్లడించారు.  క్రితంసారి పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నిర్వహించాం. కానీ వరుస షూటింగులు, వరుస గాయాలతో అతడి పరిస్థితి ఇప్పుడు మరీ అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్న షారుఖ్‌కి మరోసారి ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి మోకాలిలో వున్న డ్యామేజీ భాగానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. అంతేకాదు ఆయనకు ఈసారి కచ్చితంగా విశ్రాంతి అవసరం అని   డా.దేశాయ్  తేల్చి చెప్పారు. మరోవైపు రాయిస్ ప్రమోషనలో పాల్గొన్న షారూక్ మోకాలి గాయం బాగా వేధిస్తోందని, కొంచెం సేపు  నిలబడినా బాగా పెయిన్ వస్తోందంటూ చెప్పుకొచ్చారు.  ఈ నొప్పిని తట్టుకోవడానికి మెటాలిక్ నీ(మెకాలిచిప్ప) క్యాప్ ధరిస్తున్నానని చెప్పారు.  సాధ్యమైనంత త్వరలోనే మరో  మేజర్ సర్జరీ కి వెళ్లనున్నట్టు అభిమానులతో పంచుకున్నారు.
కాగా  ప్రస్తుతం జనవరి 2017 లోవిడుదల కానున్న రాయిస్   ప్రమోషన్ లో  బిజీగా ఉన్నాడు. నిత్యం గాయాలతో సతమతమయ్యే షారూఖ్   2013లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2015లో ఎడమ కిమోకాలి చిప్పకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement