కొడుకుతో కలిసి వీధుల్లో హీరో చిందులు | Shah Rukh Khan's Son AbRam is Dancing on The Streets of Lisbon | Sakshi
Sakshi News home page

కొడుకుతో కలిసి వీధుల్లో హీరో చిందులు

Published Sat, Oct 1 2016 8:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

కొడుకుతో కలిసి వీధుల్లో హీరో చిందులు - Sakshi

కొడుకుతో కలిసి వీధుల్లో హీరో చిందులు

లిస్బన్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన కుమారుడు అబ్రామ్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. తండ్రీ, కొడుకులు కలిసి చిందులు సైతం వేశారు. ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా! వాళ్లు పార్టీ చేసుకుంది  వీధుల్లో మరి. ప్రస్తుతం పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఇంతియాజ్ అలీ  చిత్రంలో షారుఖ్ నటిస్తున్నారు.

తనతో పాటు తన కొడుకు అబ్రామ్ ను సైతం తీసుకొనివెళ్లారు. అబ్రామ్ తో అల్లరి పనులు, తమ పార్టీకి సంబంధించిన ఫోటోలు,వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ ధోలకియా దర్శకత్వంలో షారుఖ్ నటించిన  'రాయీస్' సినిమా  2017 జనవరిలో విడుదల కానుంది. తదనంతరం ఆనంద్ ఎల్ రాయ్,గౌరీ శంకర్ సినిమాల్లో నటించనున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement