lisbon
-
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది
పంజగుట్ట: నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న పబ్‌పై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని, మరో 8 మంది మహిళలను రెస్క్యూ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట కంట్రీక్లబ్‌లో ఉన్న లిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 8 మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్ అధికారులకు, పబ్ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. -
డ్యాన్సర్‌పై వేధింపులు.. పబ్ యజమానిపై కేసు
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్‌లోని లిస్బన్ పబ్‌లో మరోసారి వివాదం రాజుకుంది. పబ్‌లోని డ్యాన్సర్‌పై యజమాని మురళీ కృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గురువారం కేసు నమోదైంది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ డ్యాన్సర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల లిస్బన్ పబ్ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. పబ్‌లోకి వచ్చే యువకుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు తనిఖీ చేసి యువతను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (లిస్బన్ పబ్‌పై పోలీసుల దాడి.. ) -
లిస్బన్ పబ్‌పై పోలీసుల దాడి..
సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలోని లిస్బన్ పబ్‌పై పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా పబ్‌లో గానాబజానా సాగుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఫీజు లేకుండానే యువతులను ఉచితంగా పబ్‌లోకి నిర్వాహకులు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గర్ల్‌ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు పబ్ నిర్వాహకులే డ్యాన్సర్ల సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో యువతుల్ని వ్యభిచారంలోకి దింపి.. డబ్బులు దండుకుంటున్నారని నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా పబ్‌లో డ్యాన్సర్లతో అర్ధనగ్న వస్త్రాలతో, మద్యం మత్తులో నృత్యాలు చేయిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ పబ్ ఎదుటే ఓ డ్యాన్సర్‌ను వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపింది. తాజా దాడిలో 21 మంది యువతులతోపాటు, 9 మంది యువకులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.47 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. -
లిస్బన్ పబ్‌లో పోలీసుల తనిఖీలు
-
మాజీ ప్రియురాలిపై యాసిడ్ దాడి
రిసార్ట్‌లో సేద తీరుతున్న ప్రియురాలిపై కక్ష్య గట్టిన మాజీ ప్రియుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటన లిస్బన్ నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్గర్వ్ రిసార్ట్‌లో సేద తీరుతున్న మహిళ(29)తో మాట్లాడాలని మాజీ ప్రియుడు ఆమెకు కబురుపెట్టాడు. అతని కలవడానికి రోడ్డు మీదకు వెళ్లిన ఆమెపై చుట్టు పక్కల ఎవరూ లేని సమయం చూసిన అతను రెండు లీటర్ల యాసిడ్‌ను ఆమెపై పోశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయి పెద్ద పెట్టున కేకలు పెట్టింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడిలో బాధితురాలి శరీరంలో 30 శాతం పూర్తిగా కాలిపోయిందని.. స్పెషలిస్టు డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. కాగా, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో యాసిడ్ దాడి జరగడంపై లిస్బన్ నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఓ క్లబ్లో ఇద్దరు యువకులపై కొందరు విషవాయువు ప్రయోగించడంతో వారు చూపు కోల్పోయారు. -
బ్రెగ్జిట్‌కు మరింత చేరువైన బ్రిటన్
లండన్ : యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో మార్చి 31 నాటికల్లా కీలకమైన చర్చలు ప్రారంభించే అధికారం బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు లభించింది. సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు గురువారం మెజారిటీ మద్దతు పలికింది. ఈయూ(ఉపసంహరణ నోటిఫికేషన్ లుకు సంబంధించిన ముసాయిదా చట్టంపై తుది చర్చల తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్ 494–122 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. లిస్బన్ దానికి సంబంధించిన ఆర్టికల్ 50 ద్వారా ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియను చేపట్టేందుకు ప్రధానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. -
కొడుకుతో కలిసి వీధుల్లో హీరో చిందులు
లిస్బన్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన కుమారుడు అబ్రామ్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. తండ్రీ, కొడుకులు కలిసి చిందులు సైతం వేశారు. ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా! వాళ్లు పార్టీ చేసుకుంది వీధుల్లో మరి. ప్రస్తుతం పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఇంతియాజ్ అలీ చిత్రంలో షారుఖ్ నటిస్తున్నారు. తనతో పాటు తన కొడుకు అబ్రామ్ ను సైతం తీసుకొనివెళ్లారు. అబ్రామ్ తో అల్లరి పనులు, తమ పార్టీకి సంబంధించిన ఫోటోలు,వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ ధోలకియా దర్శకత్వంలో షారుఖ్ నటించిన 'రాయీస్' సినిమా 2017 జనవరిలో విడుదల కానుంది. తదనంతరం ఆనంద్ ఎల్ రాయ్,గౌరీ శంకర్ సినిమాల్లో నటించనున్నారని సమాచారం. -
ప్రైవేటుకే పంపిస్తాం.. సర్కార్ డబ్బులివ్వాల్సిందే
లిస్బాన్: పోర్చుగల్‌లో ప్రైవేటు పాఠశాలలకు మద్దతుగా భారీ ఉద్యమం మొదలైంది. ఇక నుంచి తాము పూర్తి స్థాయిలో నిధులు ప్రభుత్వ పాఠశాలలపైనే పెడతామని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి ప్రజలు, విద్యార్థులు, ప్రైవేటు టీచర్లు వీధుల్లో పోరు బాట పట్టారు. దాదాపు 40వేలమంది పచ్చరంగు టీ షర్ట్స్ ధరించి డప్పులు వాయిస్తూ జాతీయ గీతం పాడుతూ లిస్బాన్లోని జులియో అమెన్యూ వద్దకు డీ.కార్లోస్ ప్రాంగాణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు పార్లమెంటుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమానికి డీఫెసా డా ఎస్కోలా పోంటో(డీఈపీ) నాయకత్వం వహిస్తోంది. ప్రైవేటు స్కూళ్ల రక్షణే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవల విద్యావిధానం పై అన్ని రకాలుగా సమీక్ష నిర్వహించిన పోర్చుగల్ ప్రభుత్వం విద్యా ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించాలని, ప్రైవేటు స్కూళ్లో చదివే వారికి తాము నిధులు చెల్లించబోమని ప్రకటించింది. ఒక్క ప్రభుత్వ స్కూళ్ల ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యం అని చెప్పింది. ఈ ఒక్క ప్రకటనతో అనూహ్యంగా పలు ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతోపాటు విద్యార్థులు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో మాత్రమే ఒక ఒప్పందం ద్వారా చేరాలి అని విధించిన నిబంధన కూడా ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగించి ఉద్యమబాట పట్టారు. -
నిజాయితీలో నెం-2 ముంబై
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత నిజాయితీగల నగరాల్లో ముంబైకి రెండోస్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఫిన్లాండ్ రాజధాని హెల్సీంకీకి ఈ విషయంలో మొదటిస్థానం లభించింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ చివరిస్థానంలో నిలిచింది. మనీ పర్సులను రోడ్డుపై పడవేసి ఎంతమంది వాటిని స్వంతదారులకు తిరిగి ఇచ్చారన్న పరీక్షద్వారా ఈ సర్వేను నిర్వహించారు. ఇలా వందలాదిమంది ప్రవర్తనను గమనించారు. యూరప్, ఉత్తర-దక్షిణ అమెరికాలు, ఆసియాలోని వివిధ నగరాల్లో సర్వేను నిర్వహించారు. ప్రతీ పర్సులో ఓ సెల్‌ఫోన్ నెంబర్, ఫ్యామిలీ ఫొటో, వివిధ కూపన్లు, బిజినెస్ కార్డులు, 50 డాలర్ల విలువగల కరెన్సీని ఉంచారు. పార్కులు, షాపింగ్‌మాల్స్, ఫుట్‌పాత్ వంటి ప్రదేశాల్లో 192 పర్సులను పడవేసి సర్వే నిర్వాహకులు చాటుగా గమనించారు. ఇందులో కేవలం 90 పర్సులు మాత్రమే వెనక్కు వచ్చాయని రీడర్స్ డెజైస్ట్ మేగజైన్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హెల్సింకీలో 12 పర్సులను వివిధ ప్రదేశాల్లో జారవిడవగా, అందులో 11 వెనక్కు వచ్చాయి. ముంబైలో 12 పర్సులకుగాను తొమ్మిది వెనక్కు వచ్చాయి. మూడో నిజాయితీగల నగరానికి వస్తే, న్యూయార్క్.. బుడాపెస్ట్‌ల మధ్య టై ఏర్పడింది. ఈ రెండు నగరాల్లో 12 పర్సులకుగాను 8 వెనక్కు వచ్చాయని సర్వే వెల్లడించింది. ఇక చివరి స్థానంలో నిలిచిన లిస్బన్లో 12 పర్సులకు కేవలం ఒకటే వెనక్కు వచ్చింది.