బ్రెగ్జిట్‌కు మరింత చేరువైన బ్రిటన్
లండన్ : యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో మార్చి 31 నాటికల్లా కీలకమైన చర్చలు ప్రారంభించే అధికారం బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు లభించింది. సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు గురువారం మెజారిటీ మద్దతు పలికింది. ఈయూ(ఉపసంహరణ నోటిఫికేషన్ లుకు సంబంధించిన ముసాయిదా చట్టంపై తుది చర్చల తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్ 494–122 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. లిస్బన్ దానికి సంబంధించిన ఆర్టికల్ 50 ద్వారా ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియను చేపట్టేందుకు ప్రధానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.