Theresa
-
ఒంటరి మినిస్టర్!
దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కార్మికులు, మహిళలు.. ఇలా ఒక్కో శాఖకు ఒక్కో మంత్రి ఉండడం ఏ దేశ క్యాబినెట్‌లోనైనా సహజమే. అయితే ఇప్పుడు బ్రిటన్‌కు ఓ కొత్త మినిస్టర్ వచ్చారు. వారే ‘లోన్లీనెస్ మినిస్టర్’! బ్రిటన్‌లో ఒంటరిగా జీవితం గడుపుతున్న వారిని అక్కున చేర్చుకుని వారికి నాలుగు తియ్యని మాటలు చెప్పే.. వాళ్లు చెప్పే కబుర్లను ఆసక్తిగా వినే.. ఆత్మీయ ఆశ్రమాలను ఆ శాఖ నెలకొల్పుతుంది. ఉద్యోగ విరమణ పొంది లేదా విడాకులు తీసుకుని లేదా అయినవాళ్లను పోగొట్టుకుని జీవితాన్ని ఒంటరిగా, నిస్పృహగా గడుపుతున్న వృద్ధుల కోసమే ప్రత్యేకంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ శాఖను సృష్టించింది. తొలి ‘లోన్లీనెస్’ శాఖ మంత్రిగా ట్రేసీ క్రౌచ్ అనే మహిళా ఎంపీని బ్రిటన్ ప్రధాని ‘థెరిస్సా మే’ నియమించారు. -
కొనసాగుతున్న బ్రిటన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
ముగిసిన పోలింగ్
మధ్యాహ్నానికి బ్రిటన్ ఫలితాలు లండన్: బ్రిటన్ పార్లమెంటుకు గురువారం పోలింగ్ ముగిసింది. మూడేళ్లు ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల మాంచెస్టర్, లండన్లలో ఉగ్రవాదుల దాడుల అనంతరం ఈ ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 2016లో బ్రెగ్జిట్ (ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)పై రెఫరెండంలో తీర్పు ఫలితంగా డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా, థెరిసా మే పీఠమెక్కారు. షెడ్యూల్ ప్రకారమైతే తర్వాతి ఎన్నికలు 2020లో జరగాల్సి ఉంది. అయితే పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు. థెరిసా మే తన భర్తతో కలిసి మెయిడెన్హెడ్ నియోజకవర్గంలోను, ఆమె ప్రత్యర్థి లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లండన్‌లోని హల్లొవేలోను ఓటు వేశారు. మొత్తం 40 వేల పోలింగ్ బూత్‌లలో 650 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. బ్రిటన్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య 4.69 కోట్లు కాగా వీరిలో భారత సంతతి ఓటర్లు 15 లక్షల మంది ఉంటారని అంచనా. ఒపీనియన్ పోల్స్ అన్నీ థెరిసా మే గెలుస్తుందని అంచనా వేశాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. -
బ్రెగ్జిట్‌కు మరింత చేరువైన బ్రిటన్
లండన్ : యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో మార్చి 31 నాటికల్లా కీలకమైన చర్చలు ప్రారంభించే అధికారం బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు లభించింది. సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు గురువారం మెజారిటీ మద్దతు పలికింది. ఈయూ(ఉపసంహరణ నోటిఫికేషన్ లుకు సంబంధించిన ముసాయిదా చట్టంపై తుది చర్చల తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్ 494–122 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. లిస్బన్ దానికి సంబంధించిన ఆర్టికల్ 50 ద్వారా ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియను చేపట్టేందుకు ప్రధానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. -
వీసా నిబంధనలు సడలించాలి
బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో చర్చల్లో మోదీ - భారత్‌కు రెండు కొత్త వీసా కార్యక్రమాలు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని - వీసా ప్రతిపాదనలను మెరుగుపరచడాన్ని పరిశీలిస్తామని థెరెసా హామీ - ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిపై కఠిన చర్యలు న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కఠినమైన వీసా నిబంధనలు, వృత్తినిపుణులు వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితిని పెంచడంపై భారత్ సోమవారం ఆ దేశానికి తన ఆందోళనను తెలియజేసింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రధానంగా భారతీయ కార్పొరేట్ల కోసం రెండు వీసా కార్యక్రమాలను ప్రకటించారు. రిజిస్టర్డ్ ప్రయాణికుల పథకం కింద వాణిజ్య ప్రయాణికులకు బ్రిటన్ సరిహద్దులో వేగవంతమైన అనుమతులు పొందుతారని.. ఈ పథకంలో భారత్ ‘తొలి వీసా దేశం’ అవుతుందని థెరెసా పేర్కొన్నారు. రెండో పథకం కింద.. వీసా, వలస సేవ అరుున ‘గ్రేట్ క్లబ్’లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను నామినేట్ చేసే తొలి ప్రభుత్వంగా భారత ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం థెరెసా ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఢిల్లీలో ఆమెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదం, భారత్-బ్రిటన్ ఆర్థిక సంబంధాలు, నేరస్తుల అప్పగింత అంశాలతో పాటు.. వీసా నిబంధనలపై చర్చించారు. కఠినమైన విద్యార్థి వీసా నిబంధనలపై భారత్ ఆందోళనను మోదీ తెలియజేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో చదువుకునే విద్యార్థులు కోర్సు పూర్తరుున వెంటనే భారత్ తిరిగి రావాలి. దీనివల్ల బ్రిటన్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోరుుంది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2010లో 68,238 ఉండగా.. ఈ ఏడాది అది 11,864కు తగ్గాయి. అలాగే.. బ్రిటన్ వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితినీ 20,800 పౌండ్ల నుంచి 30,000 పౌండ్లకు పెంచారు. అంతకుముందు భారత్ -బ్రిటన్ సాంకేతిక సదస్సులో థెరెసా, మోదీలు పాల్గొన్నారు. యువత రాకపోకలను అధికంగా ప్రోత్సహించాలంటూ బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనలను సడలించాలని థెరెసాను కోరారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లోనూ మోదీ ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. బ్రిటన్‌లో ‘ఉండిపోయే హక్కు లేని’ భారతీయులు తిరిగి వచ్చేసే వేగం, పరిమాణం పెరిగినట్లరుుతే భారత్‌కు వీసా ప్రతిపాదనలను ఇంకా మెరుగుపరిచే విషయాన్ని తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని థెరెసా హామీ ఇచ్చారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే విధానాన్ని, తగిన తనిఖీ ప్రక్రియ అనుసరిస్తామని భారత్ పేర్కొంది. మాల్యా, మైఖేల్‌లను అప్పగించండి... మనీ లాండరింగ్ ఆరోపణలున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ సహా భారత్ వాంటెడ్ జాబితాలో ఉన్న 60 మందిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్ను కోరింది. థెరెసా, మోదీల చర్చల సందర్భంగాఈ జాబితాను బ్రిటన్‌కు అందజేశారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద తమ కస్టడీకి అప్పగించాలని బ్రిటన్ 17 మందితో కూడిన జాబితాను భారత్‌కు అందించింది. నేరస్తులు, పరారీలో ఉన్న వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించరాదని ఇరుదేశాలు నిర్ణరుుంచారుు. ‘మండలి‘లో శాశ్వతానికి మద్దతు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. సభ్యత్వం కోసం ఐరాసతో నిరంతర సంప్రదింపులు జరపాలని తమ అధికారులకు మోదీ, థెరిసాలు సూచించారు. సులభ వాణిజ్యం, మేధోసంపత్తి హక్కులపై సహకారం పెంపునకు భారత్, బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారుు. వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనగాను రూ.107కోట్లతో సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం... ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్న మోదీతో థెరెసా గళం కలిపారు. ముంబై, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇద్దరూ పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. చర్చల తర్వాత ప్రకటన విడుదల చేస్తూ.. మానవాళికి ఉగ్రవాదం తీవ్ర ముప్పు అని ఉద్ఘాటించారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్‌ను పాక్ ‘అమరుడు’గా కీర్తించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులను కీర్తించొద్దన్నారు. హైదరాబాద్ హౌస్‌లో థెరెసా, మోదీ వ్యాహ్యాళి బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ పూదోటలో ప్రధాని మోదీతో కలసి వ్యాహ్యాళి చేశారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న థెరెసాను మోదీ ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ తోటలో నడుస్తూ చర్చలు కొనసాగించారు. ఇంతకుముందు గత ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీలు ఈ తోటలో నడుస్తూ మాట్లాడుకున్నారు. -
భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆ దేశాన్ని కీలక వాణిజ్య భాగస్వామిగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ అనంతరం తొలిసారి భారత్‌కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, భారత వ్యాపారులకు సులభతరమైన వీసా పాలన అందిస్తామని ప్రకటించారు. ఇండియా-యూకే టెక్ సమిట్‌లో ప్రసంగించిన థెరిస్సా, భారతీయులు ఈజీగా బ్రిటన్‌లోకి ప్రవేశించడానికి తాము ఆఫర్ చేస్తామని, రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. దీంతో యూకేను తరుచూ సందర్శించేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. బ్రిటన్, భారత్‌లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనేదే తమ అభిప్రాయమని, వ్యాపారాలకు బ్రిటన్ ఎంతో అనువైనదని థెరిస్సా చెప్పారు. సమర్థవంతమైన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలకు కేవలం చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ మాత్రమే కాక, ఇరు దేశాల ప్రజలు కూడా అవసరమేనన్నారు. తమ దేశంలో వ్యాపారాలు కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తానని హామీ ఇచ్చారు.చాలామంది భారతీయులు తమ స్కిల్స్‌ను, ఐడియాలను, బిజినెస్‌లను బ్రిటన్‌కు తీసుకొస్తున్నారని, ఇది తమ దేశానికి, ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సీఐఐ నిర్వహించిన ఈ సమిట్‌లో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని వ్యాఖ్యానించిన మోదీ, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామని తెలిపారు.