వీసా నిబంధనలు సడలించాలి | Modi met Theresa | Sakshi
Sakshi News home page

వీసా నిబంధనలు సడలించాలి

Published Tue, Nov 8 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

వీసా నిబంధనలు సడలించాలి

వీసా నిబంధనలు సడలించాలి

బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో చర్చల్లో మోదీ
- భారత్‌కు రెండు కొత్త వీసా కార్యక్రమాలు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని
- వీసా ప్రతిపాదనలను మెరుగుపరచడాన్ని పరిశీలిస్తామని థెరెసా హామీ
- ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిపై కఠిన చర్యలు
 
 న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కఠినమైన వీసా నిబంధనలు, వృత్తినిపుణులు వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితిని పెంచడంపై భారత్ సోమవారం ఆ దేశానికి తన ఆందోళనను తెలియజేసింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రధానంగా భారతీయ కార్పొరేట్ల కోసం రెండు వీసా కార్యక్రమాలను ప్రకటించారు. రిజిస్టర్డ్ ప్రయాణికుల పథకం కింద వాణిజ్య ప్రయాణికులకు బ్రిటన్ సరిహద్దులో వేగవంతమైన అనుమతులు పొందుతారని.. ఈ పథకంలో భారత్ ‘తొలి వీసా దేశం’ అవుతుందని థెరెసా పేర్కొన్నారు. రెండో పథకం కింద.. వీసా, వలస సేవ అరుున ‘గ్రేట్ క్లబ్’లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను నామినేట్ చేసే తొలి ప్రభుత్వంగా భారత ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం థెరెసా ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే.

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఢిల్లీలో ఆమెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదం, భారత్-బ్రిటన్ ఆర్థిక సంబంధాలు, నేరస్తుల అప్పగింత అంశాలతో పాటు.. వీసా నిబంధనలపై చర్చించారు. కఠినమైన విద్యార్థి వీసా నిబంధనలపై భారత్ ఆందోళనను మోదీ తెలియజేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో చదువుకునే విద్యార్థులు కోర్సు పూర్తరుున వెంటనే భారత్ తిరిగి రావాలి. దీనివల్ల బ్రిటన్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోరుుంది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య  2010లో 68,238 ఉండగా.. ఈ ఏడాది అది 11,864కు తగ్గాయి. అలాగే.. బ్రిటన్ వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితినీ 20,800 పౌండ్ల నుంచి 30,000 పౌండ్లకు పెంచారు. అంతకుముందు భారత్ -బ్రిటన్ సాంకేతిక సదస్సులో థెరెసా, మోదీలు పాల్గొన్నారు. యువత రాకపోకలను అధికంగా ప్రోత్సహించాలంటూ బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనలను సడలించాలని థెరెసాను కోరారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లోనూ మోదీ ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. బ్రిటన్‌లో ‘ఉండిపోయే హక్కు లేని’ భారతీయులు తిరిగి వచ్చేసే వేగం, పరిమాణం పెరిగినట్లరుుతే భారత్‌కు వీసా ప్రతిపాదనలను ఇంకా మెరుగుపరిచే విషయాన్ని తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని థెరెసా హామీ ఇచ్చారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే విధానాన్ని, తగిన తనిఖీ ప్రక్రియ అనుసరిస్తామని భారత్ పేర్కొంది.  

 మాల్యా, మైఖేల్‌లను అప్పగించండి...
 మనీ లాండరింగ్ ఆరోపణలున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ సహా భారత్ వాంటెడ్ జాబితాలో ఉన్న 60 మందిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌ను కోరింది. థెరెసా, మోదీల చర్చల సందర్భంగాఈ జాబితాను బ్రిటన్‌కు అందజేశారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద తమ కస్టడీకి అప్పగించాలని బ్రిటన్  17 మందితో కూడిన జాబితాను భారత్‌కు అందించింది. నేరస్తులు, పరారీలో ఉన్న వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించరాదని ఇరుదేశాలు నిర్ణరుుంచారుు.

 ‘మండలి‘లో శాశ్వతానికి మద్దతు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. సభ్యత్వం కోసం ఐరాసతో నిరంతర సంప్రదింపులు జరపాలని తమ అధికారులకు మోదీ, థెరిసాలు సూచించారు. సులభ వాణిజ్యం, మేధోసంపత్తి హక్కులపై సహకారం పెంపునకు భారత్, బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారుు. వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనగాను రూ.107కోట్లతో సంస్థను ఏర్పాటు చేస్తాయి.  
 
 ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం...
 ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్న మోదీతో థెరెసా గళం కలిపారు. ముంబై, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇద్దరూ పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. చర్చల తర్వాత  ప్రకటన విడుదల చేస్తూ.. మానవాళికి ఉగ్రవాదం తీవ్ర ముప్పు అని ఉద్ఘాటించారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్‌ను పాక్  ‘అమరుడు’గా కీర్తించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులను కీర్తించొద్దన్నారు.  
 
 హైదరాబాద్ హౌస్‌లో థెరెసా, మోదీ వ్యాహ్యాళి

 బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ పూదోటలో ప్రధాని మోదీతో కలసి వ్యాహ్యాళి చేశారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న థెరెసాను మోదీ ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ తోటలో నడుస్తూ చర్చలు కొనసాగించారు. ఇంతకుముందు గత ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీలు ఈ తోటలో నడుస్తూ మాట్లాడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement