పంజగుట్ట: నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న పబ్‌పై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని, మరో 8 మంది మహిళలను రెస్క్యూ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట కంట్రీక్లబ్‌లో ఉన్న లిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 8 మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్ అధికారులకు, పబ్ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment