undergo
-
ఆదిత్య–ఎల్1 మూడోసారి కక్ష్య పెంపు విజయవంతం
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), పోర్టుబ్లెయర్‌లోని స్పేస్ ఏజెన్సీ కేంద్రాల శాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని మరింత పెంచారు. Aditya-L1 Mission: The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My — ISRO (@isro) September 9, 2023 కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం భూమికి దగ్గరగా 296 కిలోమీటర్లు, భూమికి దూరంగా 7,1,767 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఉపగ్రహాన్ని ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా పెంచారు. లాంగ్రేజ్ పాయింట్ ఎల్1కు చేరేసరికి మరోసారి కక్ష్య పెంపు ఉంటుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం నిర్దేషిత ఎల్1 పాయింట్‌కు చేరుకోనుంది. సూర్యునిలో కరోనా అధ్యయనానికి పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఇప్పటికే భూమి, చంద్రునికి సంబందించిన ఫొటోలను పంపించింది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్1 పాయింట్‌కు చేరి సూర్యునిపై పరిశోధనలు చేయనుంది. ఇదీ చదవండి: జీవ ఇంధనాల కూటమి -
సూపర్ స్టార్‌కి మేజర్ సర్జరీ తప్పదట!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ న్ని సీరియస్ మెకాలి బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఇటీవల రాయిస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోకాలికి నీ బ్యాండ్‌తో దర్శనమిచ్చిన షారుఖ్‌కి మరోసారి సర్జరీ తో పాటు విశ్రాంతి కూడా తప్పనిసరి అని సమాచారం. కొన్ని నెలలుగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఈ సూపర్ స్టార్ కి ఈ మే నెలలో ఒక ఆపరేషన్ పూర్తయింది. ఇపుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో మరోసారి మరో సర్జరీ జరగనుందని షారూక్ కి చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. సంజయ్ దేశాయ్ ఈ విషయాలను వెల్లడించారు. క్రితంసారి పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నిర్వహించాం. కానీ వరుస షూటింగులు, వరుస గాయాలతో అతడి పరిస్థితి ఇప్పుడు మరీ అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్న షారుఖ్‌కి మరోసారి ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి మోకాలిలో వున్న డ్యామేజీ భాగానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. అంతేకాదు ఆయనకు ఈసారి కచ్చితంగా విశ్రాంతి అవసరం అని డా.దేశాయ్ తేల్చి చెప్పారు. మరోవైపు రాయిస్ ప్రమోషనలో పాల్గొన్న షారూక్ మోకాలి గాయం బాగా వేధిస్తోందని, కొంచెం సేపు నిలబడినా బాగా పెయిన్ వస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి మెటాలిక్ నీ(మెకాలిచిప్ప) క్యాప్ ధరిస్తున్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే మరో మేజర్ సర్జరీ కి వెళ్లనున్నట్టు అభిమానులతో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం జనవరి 2017 లోవిడుదల కానున్న రాయిస్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. నిత్యం గాయాలతో సతమతమయ్యే షారూఖ్ 2013లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2015లో ఎడమ కిమోకాలి చిప్పకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. -
పదేళ్ళ బాలుడికి భారత్ లో మొదటిసారి బైపాస్ సర్జరీ
న్యూ ఢిల్లీః అతి చిన్న వయసులో ఓ బాలుడికి బైపాస్ సర్జరీ చేశారు. కేవలం పదేళ్ళ వయసున్న బాలుడికి బైపాస్ చికిత్స నిర్వహించడం ఇండియాలో ఇదే ప్రధమం. న్యూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయవంతా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ ఈ హెచ్ ఐ) డైరెక్టర్ డాక్టర్ రామ్ జీ మహ్రోత్రా పర్యవేక్షణలో ఈ కార్డియో థొరాకిక్ వాస్క్యులర్ సర్జరీ నిర్వహించారు. ఆర్టేరియల్ గ్రాఫ్ట్ ను ఉపయోగించి మహ్రోత్రా కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ నిర్వహించారు. మధుర నివాసి అయిన పదేళ్ళ బాలుడు జన్యుపరమైన లోపంతో పుట్టాడు. హోమోజిగస్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా గా పిలిచే అరుదైన వ్యాధిగా దీన్ని గుర్తించవచ్చని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. మూడు రోజుల పాటు ఛాతీ నొప్పితోపాటు, శ్వాస పరమైన ఇబ్బందికి బాలుడు గురయ్యాడని డైరెక్టర్ డాక్టర్ పీయూష్ జైన్ తెలిపారు. ఆస్పత్రికి వచ్చేప్పటికే అతడు ఓసారి గుండెపోటుతో బాధపడ్డాడని, ఇక ముందు గుండె ఆగిపోయేంతటి పరిస్థితి ఉందని తెలుసుకున్న వైద్యులు... రోగి పరిస్థితిని గమనించిన వెంటనే మరిన్ని పరిశోధనలతోపాటు, చికిత్స అందించేందుకు ఐసీయూకి తరలించినట్లు తెలిపారు. యాంజియో గ్రఫీ పరీక్ష నిర్వహించిన అనంతరం కరోనరీ ఆర్టరీ బ్లాకేజెస్ ఉన్నాయని గుర్తించి అందుకు అవసరమైన కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ను వెంటనే నిర్వహించామని, అతడి గుండె కేవలం 50 శాతం సామర్థ్యం తోనే పనిచేస్తోందని తెలుసుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చిందని ఇంత చిన్న వయసులో బైపాస్ ఆపరేషన్ నిర్వహించడం వైద్యులకు ఓ సవాలేనని డాక్టర్ రాంజీ మెహ్రోత్రా అన్నారు. అంతేకాక అతడి గుండె కేవలం 22శాతం మాత్రమే కొట్టుకుంటుండటంతో ఆపరేషన్ తప్పనిసరి అయిందన్నారు. ఇప్పటివరకూ పెద్దల గుండెకు శస్త్ర చికిత్స చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి తప్పించి... ఇటువంటి చిన్న వయసువారికి హార్ట్ సర్జరీ నిర్వహించేందుకు యంత్రాలు కూడ అందుబాటులో లేవన్నారు. చాలా కాలంగా ధమనులు పనిచేయడం లేదన్న విషయాన్ని మరో పరిశీలనలో తెలుసుకున్నామని ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగి కేవలం వారం రోజుల్లోనే ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్లో ఒకటైన హైపర్ కొలెస్ట్రోలేమియా జన్యుపరమైన లోపమని, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి రోగి పరిస్థితిని ప్రమాదకరంగా మారుస్తుందని ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు.