షారుఖ్‌ కు భారీ ఫైన్‌! | Shah Rukh Khan, bmc, fine, illegal construction, షారుఖ్‌ ఖాన్‌, బీఎంసీ, ఫైన్‌, అక్రమ నిర్మాణం | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ కు భారీ ఫైన్‌!

Published Fri, Feb 12 2016 7:41 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

షారుఖ్‌ కు భారీ ఫైన్‌! - Sakshi

షారుఖ్‌ కు భారీ ఫైన్‌!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) కన్నెర్ర జేసింది. బంద్రాలోని తన కలల నివాసం 'మన్నత్‌' బయట అక్రమ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ ఆయనపై దాదాపు రూ. రెండు లక్షల  జరిమానా విధించింది.

వ్యక్తిగత అవసరాల కోసం బహిరంగ స్థలాన్ని ఆక్రమించి.. షారుఖ్‌ ఈ అక్రమ నిర్మాణాన్ని కట్టారని, దీనిని కూల్చివేయాలని స్వచ్ఛంద కార్యకర్తలు ఉద్యమించారు. వారి నిరసనతో ఈ వ్యవహారంపై మున్సిపల్‌ కమిషనర్ స్పందించి గత ఏడాది ఫిబ్రవరి 6న ఆయనకు నోటీసులు పంపారు. ఈ నోటీసు గడువు అదే ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. అయినా షారుఖ్ స్పందించకపోవడంతో బీఎంసీ ఈ నిర్మాణాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని కట్టినందుకు రూ. 1,93,784 జరిమానా చెల్లించాలని షారుఖ్‌కు బీఎంసీ డిమాండ్ నోటీసు పంపింది. ఈ జరిమానా కట్టకపోతే చట్టబద్ధ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement