‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్‌స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు.
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్‌లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్‌స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు.
Comments
Please login to add a commentAdd a comment