రజిత్ రావు, సప్తగిరి, కోదండ రామిరెడ్డి, డైమండ్ రత్నబాబు, వీజే సన్నీ
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు.
Comments
Please login to add a commentAdd a comment