Kodandarami reddy
-
నూతన నటుల వల్ల తెలుగు ఇండస్ట్రీని చూస్తే బాధేస్తుంది
-
నా కొడుకు వాడికి తోచిన సినిమాలు చేస్తున్నాడు
-
ఈ సాంగ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే : కోదండరామిరెడ్డి
-
రాజమౌళి మూవీస్ మీద కామెంట్ చేసిన కోదండరామిరెడ్డి
-
సుహాసిని అంటే మీకు ఇష్టమా లేక ప్రేమనా..?
-
వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను లేను..!
-
మూవీస్ నుంచి బ్రేక్ తీసుకోవడానికి కారణం ఇదే..!
-
చిరంజీవి సినిమాలో ఆ పాట కోసం ఎంత చెప్పినా తక్కువే..!
-
చిరంజీవి, శ్రీదేవి సినిమా ఎందుకు చేయలేదు అంటే..!
-
హీరో అవుదాం అనుకున్న కానీ..నా తలరాత..!
-
మాములు చిరంజీవిని మెగా స్టార్ చేశాను..
-
చిరంజీవి నన్ను అవమానించాడు
-
ఈవీవీ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు. -
కథే ప్రాణం
అల్లు వంశీ, ఇతీ ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.ఎస్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లిరికల్ ఆడియో సాంగ్‌ను దర్శకులు కోదండరామిరెడ్డి, వీవీ వినాయక్‌లతో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డీ, 2డీ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. 2డీ బేబి, 3డీ టెడ్డీ బేర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు కథ ప్రాణం అయితే గ్రాఫిక్స్ ఊపిరి’’ అన్నారు. -
చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్
సాక్షి, హైదరాబాద్/సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఇటు ప్రజలకు అటు కోర్టుకు అబద్ధాలు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత’పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సుల వల్లనే నష్టం వస్తోందన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారన్నారు. చర్చలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. కారి్మకులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సమ్మె జరగలేదన్నారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలి.’అని అన్నారు. కార్మికుల చావులు ప్రభుత్వ హత్యలే ఆర్టీసీ కారి్మకుల చావులు ప్రభుత్వ హత్యలేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా ఎంతమంది కడుపుకోతలను చూస్తారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడినవారి సమస్యలను పరిష్కరించకుండా ప్రగతిభవన్ మాటున ఉండాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ గిరే మీకు ఉరితాడు..: ఎల్.రమణ ఆర్టీసీ ప్రజలతో ముడిపడి ఉన్న రవాణా వ్యవస్థ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌గౌడ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. 48 వేల కుటుంబాలతో ఆటలు: చాడ కార్మికుల కడుపుకోతకు కేసీఆర్‌దే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 48 వేల కుటుంబాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. కేసీఆర్ నయా నయీంగా మారాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. 6,459 బస్సులు నడిపాం: ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,459 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,531 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,459 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు తెలిపింది. 5,453 బస్సుల్లో టిమ్ యంత్రాలు వినియోగించామని, 386 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేశామని అధికారులు చెప్పారు. సీఎం ఉద్యోగం ఊడుతది: కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కారి్మకుల ఉద్యోగాలు తీస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా ఊడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కారి్మకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళ వారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకుంటే సుమారు 50 వేల మంది కారి్మకుల ఉద్యోగాలు ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరించినా బెదిరింపులకు భయపడకుండా కారి్మకులు ఏకతాటిపై నిలబడి ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు. చలో ట్యాంక్‌బండ్ సక్సెస్ చేయండి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి: లక్ష్మణ్ జగిత్యాల: ఆర్టీసీ కారి్మకులు అధైర్య పడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జగిత్యాల డిపో ఎదుట గురువారం సమ్మెలో పాల్గొన్న కారి్మకులను కలసి సంఘీభావం తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కారి్మకులను రోడ్డు పాలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇచి్చన మాట నిలుపుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీసుల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో స్పీకర్‌ను కల సిన సంజయ్ పోలీసుల తీరుకు సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలను సమరి్పంచారు. స్పందించిన స్పీకర్ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సుశీల్‌కుమా ర్ సింగ్‌ను ఆదేశించినట్టు సంజయ్ మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలకు ఎస్వీకేలో ఉచిత వైద్యం సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కారి్మకులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కలి్పంచాలని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్వీకే భవనంలో సాధారణ ప్రజల కోసం నిర్వహిస్తున్న క్లినిక్‌లోనే పని రోజుల్లో ఉదయం 10–12 గంటల మధ్య, సాయంత్రం 6–8 గంటల మధ్య డాక్టర్ అందుబాటులో ఉంటారని ఈ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రూ.30 ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండగా, ఆర్టీసీ కారి్మకుల కుటుంబాలకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఒక కోర్సు మందులను కూడా ఉచితంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ సమ్మె : 19న తెలంగాణ బంద్!
-
19న తెలంగాణ బంద్!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు, బీజేపీ నుంచి రామచంద్రారావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వంట వార్పు, తెలంగాణ బంద్, గవర్నర్, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రేపు అన్ని పక్షలతో మాట్లాడిన తర్వాత బంద్ తేదిని ప్రకటించనున్నారు. (చదవండి : ఆర్టీసీ ఆపరేషన్ షురూ!) భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్ధామరెడ్డి మాట్లాడుతూ.. రేపు అన్ని డిపోల వద్ధ ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ తీరు మారకుంటే తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కోదండరామ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. కేసీఆర్ తీరు మారకుంటే ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బంద్‌పై రేపు మధ్యాహ్నం ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఆర్టీసీ కార్మికులకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇవ్వాలని కోరారు. -
కోదండరామిరెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చిరు, వెంకీ, బాలయ్య
-
దర్శకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చిరు, వెంకీ, బాలయ్య
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు పాల్గొన్నారు. వీరితో పాటు రాఘవేంద్రరావు, బి. గోపాల్, అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్ రాజు, అనిల్ సుంకర, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణలతో వరుస బ్లాక్ బస్టర్లతో అలరించిన కోదండ రామిరెడ్డి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వైభవ్.. తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా కొనసాగుతున్నారు. -
సీఈఓ రజత్‌కుమార్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు మార్చటానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాసంఘాలు ఉద్యమించాలని కోరారు. దీనికోసం ప్రజా ఉద్యమాలు వచ్చే అవకాశముందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలున్నాయనీ, ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వ్యవహారంపైనా సందేహాలున్నాయన్నారు. సీఈఓ రజత్‌కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆయన ప్రస్తుత ఆస్తులపై సీబీసీఐడీతో పూర్తిస్థాయి విచారణ చేయాలన్నారు. ఓట్ల తొలగింపునకు బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలని, సీఈఓ రజత్‌కుమార్‌పై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. శనివారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వై.యోగేశ్వర్రెడ్డితో కలసి కోదండరాం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టలు మార్చినంత సులువుగా రాజకీయ నేతలు పార్టీలు మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో నేతలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిం దన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విషయంలో స్పీకర్ సమానంగా వ్యవహరించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున పలువురు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాభివృద్ధికి కట్టుబడిన వారికే టీజేఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సర్పంచులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామమన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైనన్ని నిధులు , ప్రత్యేకంగా విధులు కూడా ఇవ్వాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పంచాయతీలను ఏకగ్రీవం చేయటం మంచిది కాదని, వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదు.. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదనీ, దీనిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తక్కువ చదువులు చదివిన నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం వెతకాలని చెప్పారు. ప్రైవేట్ రంగంలో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలవైపు తాము వెళ్లడం లేదన్నారు. తెలంగాణలో చేయాల్సింది చాలా ఉందని, అయితే ఏపీ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆవశ్యకత వివరిస్తూ.. గతంలో అనంతపురం నుంచి విశాఖ వరకు తిరిగామని, చీరాల చేనేత సమస్యలపై పోరాటం చేశామన్నారు. విశాఖ కాలుష్యం, ఏజెన్సీలో రేషన్ పంపిణీ వ్యవస్థపైనా గతంలో తాము పోరాటాలు చేశామన్నారు. విలీనంఅవాస్తవం తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని వస్తున్న ఊహాగానాలను కోదండరాం కొట్టిపారేశారు.ఆ వార్తలు అవాస్తవాలని వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదనీ, పార్టీ కార్యవర్గమంతా చర్చించుకున్న తర్వాత వెల్ల్లడిస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనుభవాల నుంచి ‘కూటమి’లోని పార్టీలు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కూటమి భవిష్యత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. టీజేఎస్ భవిష్యత్తు ఇతర పార్టీలపై ఆధారపడి ఉండదన్నారు. కూటమి వల్లే ఓటమి చెందామని కొందరు కాంగ్రెస్ నేతల చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంపై తాను స్పందించనన్నారు. -
ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ టికెట్టు ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. టికెట్టు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిన నేతలు ఆఖరి పోరాటం సాగిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోని తమ గాడ్ఫాదర్ల ద్వారా తుది ప్రయత్నాల్లో మునిగిపోయారు. కూటమి తరఫున దీపావళి మరుసటి రోజే 119 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఆశావహుల్లో ఆందోళన తీవ్రమైంది. ఏ సీటు మిత్రపక్షాలకు వెళుతుందో, ఏ సీటులో ఎవరికి టికెట్టు లభిస్తుందో ఢిల్లీ స్థాయిలో చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో టీజేఎస్, సీపీఐ పార్టీలు సైతం తమ వ్యూహాలకు పదను పెట్టాయి. ఉమ్మడి జిల్లా నుంచి తమ ప్రాతినిధ్యం తప్పనిసరి అని చెపుతూ ఆ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. చివరి ప్రయత్నాల్లో... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎ.రేవంత్‌రెడ్డి తదితర నేతలు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో వారి అండతో సీట్లు ఆశిస్తున్న నాయకులు కూడా దేశ రాజధాని బాట పట్టారు. ఉమ్మడి జిల్లా కు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలో తమ తుది ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. చెన్నూరు సీటును టీజేఎస్ కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ టికెట్టు ఆశిస్తున్న మాజీ అధికారి బోర్లకుంట వెంకటేష్ నేత ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు సమాచా రం. పార్టీ ముఖ్య నేత కొప్పుల రాజు ద్వారా ఆ సీటు టీజేఎస్‌కు వెళ్లకుండా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాల నుంచి సీటు ఆశిస్తున్న ఓ నాయకుడు సైతం ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పైరవీ చేస్తున్నట్లు సమాచా రం. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆశావహులు ఎవరూ స్థానికంగా లేకుండా హైదరాబాద్, ఢిల్లీలోనే టికెట్ల పైరవీల్లో మునిగిపోయారని సమాచారం. మంచిర్యాలపైనే అన్ని పార్టీల గురి మంచిర్యాల సీటు కోసం కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి టికెట్టు వేటలో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ప్రేంసాగర్‌రావు భట్టి విక్రమార్క వర్గంలో ఉండి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు హామీ కూడా పొందినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వర్గీయుడిగా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ ప్రకటించింది. తాము కోరిన ఐదు సీట్లు ఇవ్వకపోతే ప్లాన్–బిలో భాగంగా పోటీ చేస్తామని చెప్పిన తొమ్మిది సీట్లలో మంచిర్యాల కూడా ఉంది. మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ వారం రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి ఆ పార్టీ నాయకుల మనస్సు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బెల్లంపల్లి బదులు మంచిర్యాల కోరేలా ఒత్తిడి కూడా తెచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మంగళవారం కోదండరామ్‌ను కలిసిన మంచిర్యాల జిల్లా టీజేఎస్ నేతలు ఆయనను మంచిర్యాల నుంచే పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించారు. రామగుండం నుంచి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సొంత జిల్లా మంచిర్యాల నుంచే పోటీ చేయాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రూపొందించిన టీజేఎస్, సీపీఐ పార్టీలు పోటీ చేసే సీట్ల జాబితాలో మంచిర్యాల లేకపోవడం గమనార్హం. అభ్యర్థుల ప్రకటనతో పాటే పొంచి ఉన్న రెబల్స్ కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని కూటమి నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెపుతున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే రెబల్స్ జాబితా కూడా బయటకు వస్తుందని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మంచిర్యాల టికెట్టు ఆశిస్తున్న ప్రేంసాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలలో ఎవరికి సీటొచ్చినా, మరొకరు రెబల్‌గా బరిలోకి దిగడం ఖాయం. ఒకవేళ ఇక్కడ కోదండరామ్ బరిలో నిలిచినా... ప్రేంసాగర్‌రావు ఈసారి పోటీలో ఉండడం అనివార్యమే. ఈ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే టికెట్టు లభించని నేతతో ‘వార్ రూం’లో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడి బుజ్జగించే కార్యక్రమం అనివార్యమని పార్టీ నేతలు చెపుతున్నారు. చెన్నూరులో సైతం టీజేఎస్‌కు సీటిస్తే కాంగ్రెస్ రెబల్‌గా గాని, బీఎస్పీ నుంచి గాని ఓ నాయకుడు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ముథోల్, బోథ్, ఖానాపూర్, సిర్పూరులలో కూడా రెబల్స్ బెడద ఆ పార్టీని భయపెట్టనుంది. బెల్లంపల్లిలో సీపీఐకి సీటిచ్చినా, రెబల్‌గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే నాయకులు లేకపోవడం గమనార్హం. -
ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో అనుమానాస్పద మృతి
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన జయశ్రీ(19) కోదండరామిరెడ్డి ఇంట్లో ఏడాదిగా పనిచేస్తోంది. అక్కడే ఇంటి ఆవరణలోని ఓ గదిలో నివాసముంటున్న జయశ్రీ ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయింది. జయశ్రీ మరణంపై ఇంట్లోని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిరంజీవితో కామెడీ సినిమాలే చేస్తాను!
విజయవాడ: -సినిమాలు ..సందేశాత్మకంగా ఉండాలి -కొన్నింటిలో క్రైం ఎక్కువగా చూపిస్తున్నారు -సినిమా వాళ్లకు ఇగో ఫీలింగ్స్ ఎక్కువ -ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి చిరంజీవి 150వ సినిమా తన దర్శకత్వంలో తీయాల్సి వస్తే కామెడీతో కూడిన విధంగా తీసేవాడినని, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కామెడీకి బాగా సరిపోతుందని ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి అన్నారు. చిరంజీవితో ప్రజాసేవ, రైతుల కోసం, సమాజసేవ అంటూ సినిమా తీస్తే జనం చూసినవ్వుతారన్నారు. తాను, చిరంజీవి మంచి మిత్రులమని...ఆయన బాడీ లాంగ్వేజ్ తనకు బాగా తెలుసునన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ సాధారణ సమావేశం ఆదివారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యవక్తగా పాల్గొన్న ఎ కోదండరామిరెడ్డి యువతపై సినిమా ప్రభావం అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వస్తే ఎలాంటి సినిమా చేసేవారని ఓ రోటరీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కోదండ రామిరెడ్డి పై విధంగా పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమాలు వినోదంతో పాటు, సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉండాలన్నారు. ఇటీవల కొన్ని సినిమాల్లో క్రెం ఎక్కువగా చూపిస్తున్నారని, ఇవి కొంత వరకూ యువతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. యువత సందేశం మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోల సినిమాలకు తాను దర్శకత్వం వహించానన్నారు. అయితే అత్యధికంగా చిరంజీవితో 27 సినిమాలు తీశానని, వాటిలో 23 సినిమాలు మెగా హిట్‌గా నిలిచాయన్నారు. తన సినిమాలకు యండమూరి వీరేంధ్రనాథ్, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లు తోడ్పాడు ఇచ్చారని, వారి సహకారంతోనే మంచి హిట్స్ వచ్చాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇక్కడ అందరూ నవ్వుతూ, సరదాగా ఉంటున్నారన్నారు. కానీ సినిమాలో మాత్రం అలా ఉండరని, ఎవరికి వారేనని, సినిమా వాళ్లకు ఇగో ఫీలింగ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు తాడిపర్తి కిషణ్బాబు, సెక్రటరీ మాగంటి కృష్ణప్రభు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఆర్వీ సుబ్బారావు పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. -
చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం
-
చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం
ఏలూరు: సంక్రాంతి వచ్చిందంటే చిన్నా పెద్ద మొదలు, సినీ పరిశ్రమ పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు క్యూ కడతారు. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే కోడి పందాలు ఠక్కున గుర్తుకు వస్తాయి. దీంతో కోడి పందాలపై మోజుతో పాటు జిల్లాకు వచ్చే అతిథులకు ఇచ్చే ఆతిథ్యం కూడా వచ్చేవారిని కట్టిపారేస్తుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తన చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. 'ఈ పండుగ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు చాలా దూరం నుంచి కోళ్ల పందాలు, ఇతర బెట్టింగ్ ఆటలను చూసేవాడినని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కోళ్ల పందాలను సరదాగా చూసి ఎంజాయ్ చేస్తున్నా. అయితే నాకు బెట్టింగ్ కానీ, పేకాట కానీ అలవాటు లేదు. వాటి గురించి కూడా సరిగా తెలియదు. ఏదైనా దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేయడమే. నిన్న కొన్ని ఊళ్లు చక్కపెట్టాను. ఈరోజు మరికొన్ని చూడాలి. అలాగే హీరో చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం. వాళ్లింట్లోనే ఈరోజు విందు.. అదయ్యాక ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాకు వెళుతున్నాం. ఈ పండుగ మూడు రోజులు ఎంజాయ్ చేసి, బాగా తిని మళ్లీ తిరుగు ప్రయాణమే.' అని చెప్పుకొచ్చారు. -
లవ్ ఆఫ్ భల్లాల దేవ!
అచ్చమైన తెలుగందం బిందుమాధవి చాలా విరామం తర్వాత ఓ అనువాద చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. తమిళంలో విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో రూపొందిన ‘దేశింగు రాజా’ చిత్రాన్ని ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం హైదరా బాద్‌లో సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాకు ‘భల్లాల దేవ’ అనే టైటిల్ పెట్టడం తమాషాగా ఉంది. తమిళంలో లాగే తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అని కోదండరామిరెడ్డి ఆకాంక్షించారు. -
సినీరంగం పరిస్థితి బాగోలేదు
ఏలూరు : సినీరంగం పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, వ్యవస్థ మారాల్సి ఉందని, థియేటర్ల అద్దెలు, తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని శనివారం ఆయన సతీమణి భారతి, మనమడు బబ్లిలతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీరంగం అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఇప్పటివరకు 93 చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. కలియుగం దైవం శ్రీవారి ఆశీస్సులు ఉంటే మరిన్ని మంచి చిత్రాలకు దర్శక త్వం వహిస్తానని తెలిపారు. చిరంజీవితో ఖైదీ, రాక్షసుడు, పసివాడి ప్రాణం, ఛాలెంట్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇలా 27 చిత్రాలు, నందమూరి బాలకృష్ణతో 16 చిత్రాలు తీసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని, ముఖ్యంగా తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన ఏడుకొండల వలే పారిజాతగిరి కొండలు కూడా ఉండటం అద్భుతమన్నారు. కోదండరామిరెడ్డికి ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వేద ఆశ్వీరచనాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు. ప్రముఖులు బొమ్మారెడ్డి నాగ చంద్రారెడ్డి, మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆపదలో వెళ్తే..ప్రైవేటే!
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల కన్నా మెరుగైన వైద్యం చేస్తారన్న భ్రమతో రోగులను తీసుకొస్తే వైద్యులు లేరని, సరైన పరికరాలు లేవని చెప్పి అడ్మిట్ చేసుకోవడం లేదు. కనీసం ప్రథమ చికిత్స చేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూస్తాం.. 24 గంటలూ వైద్య సేవలు అందిస్తామని బోర్డులు ఏర్పాటు చే సినా.. అవి కేవలం ప్రచారం వరకేనని స్పష్టమవుతోంది. ఈ నెల ఒకటో తేదీన అనంతపురంలోని కోవూర్‌నగర్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు కోదండరామిరెడ్డి ఆటో ప్రమాదంలో గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉండగా పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. సకాలంలో వైద్యమందించక బాలుడి మృతికి కారకులై అతడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రథమ చికిత్సకు పాతర.. అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా ముందు ప్రథమ చికిత్స చేసి.. అవసరాన్ని బట్టి ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. అయితే జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రోగిని చూసి.. ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంది అని భావిస్తే.. ప్రాథమిక చికిత్స, పరీక్షలు కూడా చేయకుండానే తిరస్కరిస్తున్నారు. బెంగళూరు, కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చికిత్స చేయించేలోపు రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. ఎందుకిలా..? చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు లేరు. ఏదో ఇద్దరు ముగ్గురు వైద్యులతో నడిపించేస్తున్నారు. కొందరు వైద్యులు వారి విభాగం కాకుండా ఇతరత్రా సమస్యలపై ఇసుమంతైనా జోక్యం (ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని) చేసుకోవడం లేదు. వైద్యంపై కాస్త అవగాహన ఉన్న రోగులెవరైనా వైద్యున్ని రెండు..మూడు సందేహాలడిగితే, ఈ పరీక్షలన్నీ చేయించుకుని రండంటూ చాంతాడంత లిస్టు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరాలు, రక్తహీనత, సీజనల్ వ్యాధులైతేనే వెంటనే చేర్చుకుంటున్నారు. కాస్త ఆందోళనకరంగా ఉందని తెలిస్తే మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఫిట్స్ వచ్చిన వారిని తీసుకొస్తే చాలు.. కొన్ని ఆస్పత్రులైతే వాకిలి వద్దే ‘కర్నూలుకు వెళ్లండ’ని చెప్పేస్తున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 137 ప్రైవేట్ ఆస్పత్రులు, 40 క్లినిక్‌లు ఉన్నాయి. అందులో 20 పడకల ఆస్పత్రులు 91, 50 పడకల ఆస్పత్రులు 31, వంద పడకల ఆస్పత్రులు 15, డెంటల్ ఆస్పత్రులు 15 ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు 122 ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా నడుస్తున్న క్లినిక్‌లకు లెక్కేలేదు. జిల్లాలో ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయని ప్రశ్నిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సర్వే చేస్తే గాని ఆ వివరాలు తెలియవంటున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిందే.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా వారి పరిస్థితి చూసి ప్రథమ చికిత్స తప్పకుండా చేయాలి. చికిత్స చేయకుండా వెనక్కు పంపకూడదు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన వారి బాధితులు మమ్మల్ని ఆశ్రయిస్తే శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తాం. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా అన్ని ఆస్పత్రులూ పనిచేయాలి. - డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు, జిల్లా వైద్య రోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) -
వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన బుధవారం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదుట నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనను శాస్త్రోక్తగా నిర్వహించారు. మొదట గురుదక్షిణామూర్తిని సర్వాంగసుందరంగా అలంకరిం చారు. తర్వాత గురుదక్షిణామూర్తి వద్దే పూజారులు, వేదపండితులు హోమం వెలిగించి మం త్రోచ్ఛారణలతో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచమూర్తులైన స్వామి, అమ్మవార్లు, వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, క న్నప్ప, చండికేశ్వరుని పేర్లతో ధ్వజస్తంభానికి నాలుగు దిక్కుల పూజలు చేశారు. కలశాలలోని పవిత్ర జలాలను, రాగి నాణేలను ఉంచి ప్రధాన అర్చకులు బాబుగురుకుల్, సాంబయ్య ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. ధ్వజాన్ని అభిషేకించిన ఆకాశగంగ.. పూజల అనంతరం ధ్వజానికి అభిషేకం జరిపేందుకు వేదపండితులు, అర్చక స్వాము లు సన్నద్ధమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ధ్వజస్తంభం పూర్తిగా తడిసింది. ముక్కోటి దేవతలతోపాటు దివి నుంచి భువికి దిగివచ్చిన వరుణుడు స్వయం గా ఆకాశగంగతో స్వామివారి ధ్వజస్తంభాన్ని అభిషేకించాడంటూ వేదపండితులు, భక్తులు, ఆలయాధికారులు జయజయ ధ్వానాలు చేశా రు. ధ్వజస్తంభంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీరామచంద్రమూర్తితో పాటు ఆలయాధికారులు గోపాలకృష్ణమూర్తి, కోదండరామిరెడ్డి, రామిరెడ్డి, నాగభూషణం, హరియాదవ్, లోకేష్, వెంకటేశ్వరరాజు, బాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు. శివయ్య ఆశీర్వాదంతోనే విజయవంతం శ్రీకాళహస్తి శివయ్య ఆశీర్వాదంతోనే ధ్వజ స్తం భాన్ని విజయవంతంగా ప్రతిష్ఠాంచామని ఆల య ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ప్రతిష్ఠాపన సమయం లో వర్షం రావడం శుభసూచికమన్నారు. ఆల య శిల్పసౌందర్యానికి ఎలాంటి విఘాతం ఏర్పకుండా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం సాహసోపేతంగా మారిందని చెప్పారు. మొద ట ఆందోళన చెందామని, ఆ దేవుని దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కార్యక్రమం ముగిసిందన్నారు. 112 ఏళ్ల తర్వాత శివయ్య ధ్వజ స్తంభా న్ని తన చేతులమీదుగా ప్రతిష్ఠించే భాగ్యం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిపారు.