ఆర్టీసీ సమ్మె : 19న తెలంగాణ బంద్‌! | RTC Strike :Telangana Bandh On October 19th | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె : 19న తెలంగాణ బంద్‌!

Published Wed, Oct 9 2019 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

 ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి  ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు, బీజేపీ నుంచి రామచంద్రారావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. వంట వార్పు, తెలంగాణ బంద్‌, గవర్నర్‌, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రేపు అన్ని పక్షలతో మాట్లాడిన తర్వాత బంద్‌ తేదిని ప్రకటించనున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement