చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం | kodandarami reddy openup on sankranti festival | Sakshi
Sakshi News home page

చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం

Published Fri, Jan 15 2016 12:18 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం - Sakshi

చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం

ఏలూరు: సంక్రాంతి వచ్చిందంటే చిన్నా పెద్ద మొదలు, సినీ పరిశ్రమ పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు క్యూ కడతారు. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే కోడి పందాలు ఠక్కున గుర్తుకు వస్తాయి. దీంతో కోడి పందాలపై మోజుతో పాటు జిల్లాకు వచ్చే అతిథులకు ఇచ్చే ఆతిథ్యం కూడా వచ్చేవారిని కట్టిపారేస్తుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తన చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. 'ఈ పండుగ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది.

 

చిన్నప్పుడు చాలా దూరం నుంచి కోళ్ల పందాలు, ఇతర బెట్టింగ్ ఆటలను చూసేవాడినని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కోళ్ల పందాలను సరదాగా చూసి ఎంజాయ్ చేస్తున్నా. అయితే నాకు బెట్టింగ్ కానీ, పేకాట కానీ అలవాటు లేదు. వాటి గురించి కూడా సరిగా తెలియదు. ఏదైనా దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేయడమే. నిన్న కొన్ని ఊళ్లు చక్కపెట్టాను. ఈరోజు మరికొన్ని చూడాలి. అలాగే హీరో చిరంజీవి గారి ఇంట్లోనే విడిది చేశాం. వాళ్లింట్లోనే ఈరోజు విందు.. అదయ్యాక ఎక్స్ప్రెస్ రాజా సినిమాకు వెళుతున్నాం. ఈ పండుగ మూడు రోజులు ఎంజాయ్ చేసి, బాగా తిని మళ్లీ తిరుగు ప్రయాణమే.' అని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement