అందుకే ‘అన్‌ స్టాపబుల్‌’ టైటిల్‌ పెట్టాం :  వీజే సన్నీ | vj sunny talk about unstoppable movie | Sakshi
Sakshi News home page

vj sunny:పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి రెడీ

Published Tue, Jun 6 2023 4:52 PM | Last Updated on Tue, Jun 6 2023 4:52 PM

vj sunny talk about unstoppable movie - Sakshi

నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని. అన్‌స్టాపబుల్‌ షోకి కూడా వెళ్లాను. నా సినిమాకు ఆ టైటిల్‌  ఎందుకు పెడుతున్నారని  రత్నబాబుని అడిగాను. ‘మన టైటిల్ అన్ స్టాపబుల్ అన్ లిమిటెడ్ ఫన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టైటిల్ జనాల్లో ఉంది కాబట్టి అన్ స్టాపబుల్ యాప్ట్ గా ఉంటుంది’ అని చెప్పారు. నాకు కూడా టైటిల్‌ బాగా నచ్చింది’ అని హీరో వీజే సన్నీ అన్నాడు. రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీజే సన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే   కథలన్నీ ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో 'అన్ స్టాపబుల్' లాంటి అన్ లిమిటెడ్ ఫన్ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది.

ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లంతా నాకు కంఫర్ట్ జోన్ కల్పించారు. పృద్వీతో మంచి స్నేహం ఏర్పడింది. అలాగే పోసాని, రాజా రవీంద్ర, రఘు ఇలా అందరితో పని చేయడం మంచి అనుభూతి. నన్ను ఎప్పుడూ కొత్తవాడిలా ట్రీట్ చేయలేదు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది.  

సప్తగిరి చాలా ఎనర్జిటిక్. సీన్ లో ఆయన ఉండే ఇన్వాల్వ్ మెంట్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. సీన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక ప్లాన్ లో ఉంటారు. ఆ ప్లాన్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. తనని పరిశీలించాను కాబట్టి అతనకి తగట్టు నేను వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. చాలా  స్పోర్టివ్ స్పిరిట్ తో వర్క్ చేశాం.

ఇందులో నాకు జోడిగా నక్షత్ర నటించింది. తను ఇంతకుముందు ‘పలాస’ అనే సినిమా చేశారు. తను తెలుగమ్మాయి కావడం వలన సెట్స్ లో ఉన్నప్పుడు ప్రామ్టింగ్ ఇచ్చే అవసరం ఉండేది కాదు. చాలా చక్కగా నటించారు.

బిగ్ బాస్ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్ రత్నబాబు గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రత్నబాబు గారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం.

‘ఎటీఎం’ చూసి దర్శకుడు హరీష్ శంకర్ గారు ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉంది. నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే ఓ పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను.

ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి ఫన్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement