‘‘దేశం నలుమూలల నుంచి మా ‘పుష్ప 2’ యూనిట్‌కి స΄ోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి, భారతీయులకు థ్యాంక్స్. ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్‌గారికి «థ్యాంక్స్. నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది.
శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతోంది. చిత్రబృందం తరఫున, తెలుగువారందరి తరఫున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి థ్యాంక్స్. దేశంలో మా సినిమాకు స΄ోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు’’ అన్నారు.
ఆ సంఘటన చాలా బాధ కలిగించింది
‘‘నేను ‘పుష్ప 2’ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే. అనుకోకుండా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతిగారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత ఇరవయ్యేళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను. అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు. డిసెంబరు 4న వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్లి΄ోయాను. ఇంటికి వచ్చిన తర్వాత రేవతిగారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్.
సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చె΄్పాలి. ఈ సినిమాను ఇంతగా ్ర΄ోత్సహించింది, పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే. 3 గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ. మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. ఎందుకంటే జరిగిన ఘటన (రేవతి మృతి) అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు.
‘‘మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్. వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘పుష్ప 2’ రెండు రోజులకు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినందుకు ఆనందంగా ఉంది. టికెట్ ధర 800 ప్రీమియర్ షోకి మాత్రమే.. ఆ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులో ఉన్నాయి. అందరూ కచ్చితంగా సినిమాని చూడాలి’’ అని యలమంచిలి రవిశంకర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment