హీరో రామ్కు ఆరు వారాల విశ్రాంతి! | Ram asked to take rest for six weeks | Sakshi
Sakshi News home page

హీరో రామ్కు ఆరు వారాల విశ్రాంతి!

Published Mon, Aug 10 2015 7:55 PM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

హీరో రామ్కు ఆరు వారాల విశ్రాంతి! - Sakshi

హీరో రామ్కు ఆరు వారాల విశ్రాంతి!

హీరో రామ్.. తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా అతడి ఎడమచెయ్యి కొద్దిగా దెబ్బతింది. యాక్షన్ సీన్ షూటింగ్ చేసేటప్పుడు లిగ్మెంట్ దెబ్బ తినడంతో వైద్యులు ఓ వారం రోజులు దానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. అయితే, రామ్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. మరో నాలుగు యాక్షన్ సీన్ల షూటింగులో పాల్గొన్నాడు.

దాంతో గాయం మరింత పెద్దదైంది. చివరకు తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్ ఉందని, ఈలోపు చేతికి పూర్తి విశ్రాంతి ఇస్తున్నానని రామ్ చెప్పాడు. వైద్యులు చెప్పినప్పుడు వినిపించుకోకుండా చేస్తే ఇలాగే అవుతుందంటూ తన చేతి గాయం ఫొటోలను ట్వీట్ చేశాడు. ఆ చేతికి ప్రస్తుతం ఫిజియోథెరపీ, వాక్స్ థెరపీ చేస్తున్నారు. శివం సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా నటిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement