wrist injury
-
యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం
టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. లంకతో టి20 సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొలి టి20లో బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్ రెండో టి20లో జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోందన్నారు. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్ దూరమయ్యాడని తెలిపారు. రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశామని పేర్కొన్నాడు. దీంతో చండీఘర్‌లో ఉన్న మయాంక్ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్ అయ్యాడు. మయాంక్ జట్టుతో కలిసినప్పటికి బయోబబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. కాగా రుతురాజ్ వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్‌లు దూరమైన సంగతి తెలిసిందే. ఇక లంకతో తొలి టి20లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా శనివారం రెండో టి20 ఆడనుంది. ఒక మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్ లైనఫ్‌ను లంక బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే... -
యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న థీమ్
డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్ నంబర్ 6 యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ బుడాపెస్ట్ (హంగేరీ)లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 150వ ర్యాంకర్ శ్రీజ 11–9, 11–6, 13–11తో ప్రపంచ 53వ ర్యాంకర్ బార్బొరా బలజోవా (స్లొవాక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన వరల్డ్ 60వ ర్యాంకర్ మనికా బాత్రాతో తలపడుతుంది. -
భారత్‌తో తొలి టెస్టు : కీలక ఆటగాడు దూరం
చెన్నై: టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలీ మణికట్టు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జాక్ క్రాలీ సిద్ధమవుతూ తన రూం నుంచి వస్తూ మార్బుల్ ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దీంతో అతని చేతికి గాయమవ్వగా... క్రాలీని వెంటనే స్కానింగ్‌కు తరలించారు. అయితే రిపోర్ట్‌లో క్రాలీ మణికట్టుకు గాయమైనట్లు తేలడంతో తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఈసీబీ వెల్లడించింది. కాగా క్రాలీ ఇంగ్లండ్ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీతో(267 పరుగులు) మెరవడంతో క్రాలీ అందరి దృష్టిలో పడ్డాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్ కాగా గాయపడ్డ క్రాలీ స్థానంలో రోరీ బర్న్స్.. డోమ్ సిబ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే జట్టులో అదనపు ఓపెనర్‌గా ఉన్న ఓలీ పోప్ మూడో స్థానంలో బరిలోకి దిగితే.. కెప్టెన్ జో రూట్ నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మూడో స్థానంలో బరిలోకి దిగితే మాత్రం ఓలీ పోప్ బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారే అవకాశం ఉంది. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఆర్చర్లతో పేస్ దళం పటిష్టంగా ఉండగా.. ఆల్‌రౌండర్ కోటాలో మెయిన్ అలీ, క్రిస్ వోక్స్లో ఒకరికే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో మేనేజ్మెంట్ మొయిన్ అలీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు 330 రోజుల కరోనా విరామం తర్వాత భారత్‌లో క్రికెట్ ప్రారంభవనున్న నేపథ్యంలో టీమిండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు బాగా క్రేజ్ వచ్చింది.చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం -
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్‌లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్‌ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
హీరో రామ్‌కు ఆరు వారాల విశ్రాంతి!
హీరో రామ్.. తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా అతడి ఎడమచెయ్యి కొద్దిగా దెబ్బతింది. యాక్షన్ సీన్ షూటింగ్ చేసేటప్పుడు లిగ్మెంట్ దెబ్బ తినడంతో వైద్యులు ఓ వారం రోజులు దానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. అయితే, రామ్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. మరో నాలుగు యాక్షన్ సీన్ల షూటింగులో పాల్గొన్నాడు. దాంతో గాయం మరింత పెద్దదైంది. చివరకు తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్ ఉందని, ఈలోపు చేతికి పూర్తి విశ్రాంతి ఇస్తున్నానని రామ్ చెప్పాడు. వైద్యులు చెప్పినప్పుడు వినిపించుకోకుండా చేస్తే ఇలాగే అవుతుందంటూ తన చేతి గాయం ఫొటోలను ట్వీట్ చేశాడు. ఆ చేతికి ప్రస్తుతం ఫిజియోథెరపీ, వాక్స్ థెరపీ చేస్తున్నారు. శివం సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా నటిస్తోంది. That's what happens when the doctors ask u 2 take rest n u just carry on with ur work schedule.. :/ pic.twitter.com/taErKuHFT7 — Ram Pothineni (@ramsayz) August 7, 2015