చెన్నై: టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలీ మణికట్టు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జాక్ క్రాలీ సిద్ధమవుతూ తన రూం నుంచి వస్తూ మార్బుల్ ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దీంతో అతని చేతికి గాయమవ్వగా... క్రాలీని వెంటనే స్కానింగ్‌కు తరలించారు. అయితే రిపోర్ట్‌లో క్రాలీ మణికట్టుకు గాయమైనట్లు తేలడంతో తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఈసీబీ వెల్లడించింది. కాగా క్రాలీ ఇంగ్లండ్ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీతో(267 పరుగులు) మెరవడంతో క్రాలీ అందరి దృష్టిలో పడ్డాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్
కాగా గాయపడ్డ క్రాలీ స్థానంలో రోరీ బర్న్స్.. డోమ్ సిబ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే జట్టులో అదనపు ఓపెనర్‌గా ఉన్న ఓలీ పోప్ మూడో స్థానంలో బరిలోకి దిగితే.. కెప్టెన్ జో రూట్ నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మూడో స్థానంలో బరిలోకి దిగితే మాత్రం ఓలీ పోప్ బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారే అవకాశం ఉంది. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఆర్చర్‌లతో పేస్ దళం పటిష్టంగా ఉండగా.. ఆల్‌రౌండర్ కోటాలో మెయిన్ అలీ, క్రిస్ వోక్స్‌లో ఒకరికే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో మేనేజ్‌మెంట్ మొయిన్ అలీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు 330 రోజుల కరోనా విరామం తర్వాత భారత్‌లో క్రికెట్ ప్రారంభవనున్న నేపథ్యంలో టీమిండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు బాగా క్రేజ్ వచ్చింది.చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment