
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్‌లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్‌ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.