
వెళ్లండి.. ఆ సినిమా చూడండి!
రామ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన శివం సినిమాకు వెళ్లాలని అభిమానులను మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోరుతోంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా హీరోయిన్ రాశిఖన్నాకు రకుల్ తన ఆల్ ద బెస్ట్ చెప్పింది.
పొద్దున్నే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రకుల్.. హీరో రామ్కు కూడా అభినందనలు తెలిపింది. ఇక అభిమానులనైతే, గయ్స్.. వెళ్లండి, సినిమా చూడండి అంటూ పొలికేకలు పెట్టి మరీ చెబుతోంది. తమ అందాల తార చెప్పిన తర్వాత మరి కుర్రాళ్లు ఊరుకుంటారా.. వెళ్లి చూస్తారు కదూ.
All d besttttttt to @ramsayz and my darling @RaashiKhanna for #Shivam releasing today... Guys go watch it!!
— Rakul Preet (@Rakulpreet) October 2, 2015