
సాగర తీరంలో ప్రేమ పాఠాలు!
గోవా అంటే బ్యాచిలర్స్‌కు ప్యారడైజ్. ఇక ప్రేమికులైతే అక్కడికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు హీరో రామ్ కూడా హీరోయిన్ కీర్తీ సురేశ్‌తో కలిసి ప్రేమపాఠాలు వల్లిస్తున్నారు. అయితే నిజంగా కాదండోయ్... సినిమా కోసమే. రామ్, కీర్తీ సురేశ్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికి శోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. శనివారం నుంచి గోవాలో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 26తో పాట చిత్రీకరణ పూర్తవుతుంది. ‘‘రామ్ స్టయిల్లో సాగే ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. టైటిల్ ఈ వారంలోనే వెల్లడిస్తాం. జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: సమీర్‌రెడ్డి, సమర్పణ: కృష్ణచైతన్య.