
దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.
ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్