సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడుల మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో దాని ప్రభావంవల్ల రానున్న రెండు రోజులపాటు రాయలసీమ, ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మంగళవారం నుంచి అకాల వర్షాల ప్రభావం తగ్గుతుందని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉదయగిరిలో 5, వెలిగండ్లలో 4, మార్కాపూర్, కడప, ప్రొద్దుటూరుల్లో 3, రాజంపేట, పుల్లంపేట, నంబూరి పులికుంట్ల, కుప్పం, కమలాపురంలలో 2 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
నేడు, రేపు వర్షాలు
Published Sun, Apr 1 2018 9:01 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment