విదర్భ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.
సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా బుధవారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా బుధవారం సాయంత్రం వర్షాలు కురిశాయి. విశాఖలో 3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో భోపాల్‌కు 50 కి.మీ. దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనించి మరో 24 గంటల్లో క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.