న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(గురువారం) కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్వాంచల్, పశ్చిమ యూపీలో భారీ వర్షాలకు కురవనున్నాయనే హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. కిన్నౌర్, సిర్మౌర్, సోలన్, సిమ్లా, బిలాస్‌పూర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు వర్షం కొనసాగుతుంది
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు వాయువ్య దిశలో కదులుతుందనే అంచనాలున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు బీహార్‌లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా ఉంటాయని అంచనా. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది బెంగాల్ తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి బీహార్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: నల్లమలలో పక్షుల కిలకిల
Comments
Please login to add a commentAdd a comment