
సాక్షి, విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్ప అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మండల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, తదితర సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగంతో సహకరించి వారు జారీ చేసిన సూచనలు పాటించాలని కోరారు. (ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు)
కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు :
బందరు కలెక్టరేట్ : 08672-252572
విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805
సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454
సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు : 08656- 232717
రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486
రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697